అచ్చంపేట నియోజకవర్గంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడి పర్యటన

Published: Wednesday September 15, 2021
హైదరాబాదు 14 సెప్టెంబర్ ప్రజాపాలన : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడి పర్యటన. నాగర్ కర్నూల్ జిల్లా మాల మహానాడు ప్రధాన కార్యదర్శిగా బిజ్జా రవీందర్ మరియు అచ్చంపేట మండల మాల మహానాడు కన్వీనర్ గా పాండు నియామకం. నియామక పత్రాలు అందజేసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య. సోమవారం నాడు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశం టి.ఎన్.జి.ఓ భవనంలో మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుందా మల్లికార్జున్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య. టి.ఎన్.జి.ఓ భవనం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు మాల మహానాడు కార్యకర్తలతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారన్నారు. అచ్చంపేట పట్టన కూడలి లోని అంబేద్కర్  విగ్రహనికి పూలమాల వేశారన్నారు. మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, మాలలందరూ ఆర్థిక, సామజిక, రాజకీయ రంగాల్లో ఎదగాలని, అదేవిధంగా మాలల బలోపేతానికి కృషి చేసి, చైతన్యవంతులుగా కావాలన్నారు. మాలలు అందరు ఐక్యమై రాజ్యాధికార దిశగా పయనించాలని సూచించారు. తదుపరి నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బిజ్జా రవీందర్ మరియు అచ్చంపేట మండల మాల మహానాడు కన్వీనర్ గా పాండును నియమించినట్లు తెలిపారు. నూతనంగా ఎన్నికైన వారికి నియామక పత్రాన్ని అందజేసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లపల్లి రవి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి వెంకటేష్, కే.నాసరయ్య, జె.భీమయ్య, శ్రీనివాసులు, రామస్వామి, సిద్ధార్థ, రామకోటి, మహేందర్, లక్ష్మణ్, సుధాకర్, లింగం, డి.భాస్కర్ మరియు మాల మహానాడు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కోవిడ్ నిబంధనలను పాటిస్తూ విజయవంతం చేశారని తెలిపారు.