*షాబాద్ మండల్ మన్మరి గ్రామంలో ఉచిత కంటి పరీక్షశిబిరం విజయవంతం*

Published: Friday January 20, 2023
*ప్రజా పాలన షాబాద్::= షాబాద్ మండల్ మన్మరి గ్రామంలో ఉచిత కంటి పరీక్షా శిబిరం విజయవంతం అయింది గ్రామంలోని కంటి సమస్యలున్న ప్రతి ఒక్కరు వచ్చి చెకప్ లు చేసుకొని కంటి సమస్యలను బట్టి ఉచితంగా అద్దాలు ఇవ్వడం జరిగింది ఆపరేషన్ అవసరం ఉన్న వాళ్ళకి మళ్లీ తెలియజేశామని చెప్పారు రాష్ట్రంలో ప్రజలందరికీ కంటి వైద్యం అందుబాటులోకి తీసుకురావడానికి కంటి వెలుగు ద్వారా ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగానే గురువారం నాడు మన్మరి గ్రామం పంచాయతీ ఆఫీస్ లో కంటి పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీపీ ప్రశాంతి మాట్లాడుతూ ఈ కంటి వెలుగు ప్రోగ్రాంని మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 ఆగస్టు 15 మల్కాపూర్ గ్రామ పంచాయతీల్లో ప్రారంభించారు మొదటి విడత కంటి వెలుగు ప్రోగ్రాంనీ ప్రజలు వినియోగించుకని విజయవంతం చేశారు అదేవిధంగా రెండో విడత కంటి వెలుగు ప్రోగ్రాంను నిన్న ఖమ్మం జిల్లాలో లాంచనంగా ప్రారంభించారు ఈ రెండో విడత కంటి వెలుగు ప్రోగ్రాం ని కూడా అదే స్థాయిలో విజయవంతం చేయాలని అన్నారు ఈ కంటి వెలుగు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం బీద మధ్యతరగతి ప్రజలు కంటి సమస్యలతో బాధపడుతూ ఖరీదైన వైద్యం చేయించుకోలేరు కాబట్టి గ్రామాల్లో ఆ సమస్యను నిర్మూలించాలనే ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది అని అన్నారు అనంతరం గ్రామాల్లో పర్యటించి అక్రమ కట్టడాలను చూశారు రోడ్లపై మోరీలపై వేసినా రాంపులను వెంటనే కూల్చివేయాలని సెక్రెటరీ  సర్పంచ్ నీ ఆదేశించారు రోడ్లపై మురుగునీరు చెత్తాచెదారం వేయకూడదని గ్రామంలోని అన్ని గల్లీలను శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు అక్రమ కట్టడాలను రాంపులను కూల్చివేయడానికి ముందు ఒక మీటింగ్ పెట్టుకుని తద్వారా వారికి నోటీసులు ఇవ్వాలని తీసి వేయని ఎడల పోలీస్ సహకారంతో అన్నింటినీ కూల్చి వేయడం జరుగుతుందని అన్నారు  * *ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రశాంతి,ఎంపీడీవో అనురాధ,సర్దార్ నగర్ సెక్రటరీ మధుసూదన్ రెడ్డి,  సర్పంచ్ సుహాసిని సత్యనారాయణ*,*డిప్యూటీ సర్పంచ్ గోపాల్, సెక్రటరీ శివకుమార్ గౌడ్,టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు పాండురంగారావు,ఆరిఫ్,కరోబార్ పరమేష్, కావాలి మహేష్,షాబాద్ అంగన్వాడీ ఇంచార్జ్ సృజన,అంగన్వాడి టీచర్ గిరిజ,షావుకారి రమేష్*,
*డాక్టర్ పి శ్రీనివాస్ ఎంఓ డాక్టర్ మీనాజుద్దీన్ ఖాన్, బలరాం ఎస్ ఓ,యు సి సువర్ణ హెచ్ /ఎస్ కే ఉమారాణి హెచ్ బి గోపాల్ హెచ్ ఎ వనజ అనురాధ సరిత మంగమ్మ రజియా( ఆశ ) డి శ్యామ్ వీ రాహుల్ డీఈవో స్వప్న రమేష్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు*