ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ ప్రజాపాలన ప్రతినిధి *అంతర్జాలం అందక పెన్షన్ దారుల అవస్థలు*

Published: Wednesday December 07, 2022
ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్ గ్రామంలో పెన్షన్ దారులు అవస్థలకు గురవుతున్నారు. పొద్దస్తమానం తపాలా కార్యాలయం ముందు పడిగాపులు కాస్తూ పెన్షన్ డబ్బులు ఎప్పుడు వస్తాయా తమ సమస్యలను ఎప్పుడు తీర్చుకోవాలా అని ఎదురుచూపులు చూస్తున్నారని తులేకలాన్ సర్పంచ్ చిలుకల యాదగిరి తెలిపారు. ఫినో  మిషన్ కు అంతర్జాలం అందక రోజంతా పది మందికి సైతం అందని దుస్థితి నెలకొంది. అంతర్జాలం అందక ఒక్కొక్కరికి గంట నుండి రెండు గంటల వరకు సమయం పడుతుందని, పెన్షన్ కోసం వచ్చిన వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు అన్నా హారాలు మాని పడిగాపులు కాస్తూ తులేకలాన్ గ్రామ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు పెన్షన్ దారులు పడుతున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని సమస్యను పరిష్కరించి ప్రజలకు దోహదపడాలని పెన్షన్ దారులు కోరుతున్నారు.
*ఇంచార్జ్ ఎంపీడీవో శ్రీనివాస్ ను వివరణ అడగగా
కొన్నిచోట్ల ఫినోమిషిన్లు అంతర్జాలం అందక ఇలాగే మొరాయిస్తున్నాయని తపాలా శాఖతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.