ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కోట రాంబాబు మధిర రూరల్

Published: Monday September 26, 2022

సెప్టెంబర్ 25 ప్రజాపాలన ప్రతినిధి నియోజవర్గ పరిధిలో ఆదివారం నాడుఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కెవిఆర్ హాస్పిటల్ అధినేత జిల్లా టిఆర్ఎస్ నాయకులు కోటా రాంబాబు ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూతెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ పండుగ అని టీఆరెఎస్ పార్టీ జిల్లా నాయకులు *డా.కోట రాంబాబు*  అన్నారునియోజకవర్గ ఆడపడుచులు అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు నుంచి తొమ్మిది రోజుల పాటు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాన్ని చాటి చెప్పే, తీరొక్క రంగులతో తీరొక్క పువ్వులతో జరిగే బతుకమ్మ పండగ సంబురాలను మధిర నియోజకవర్గ మరియు తెలంగాణ ఆడబిడ్డలు అత్యంత ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.