నగర మరుగు దొడ్ల పరిశుభ్రత, నిర్వహాణను పరిశీలించిన అన్ని రకాల వసతి సౌకర్యాలతో పబ్లిక్ టాయిలె

Published: Thursday June 09, 2022
మేయర్ సునిల్ రావు, కమీషనర్ సేవా ఇస్లావత్.
 
కరీంనగర్ జూన్ 8 ప్రజాపాలన ప్రతినిధి:
నగరపాలక సంస్థ ద్వారా పురుషులు, మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రజా మరుగు దొడ్లలో పరిశుభ్రత పాటిస్తున్నామని నగర మేయర్ యాదగిరి సునిల్ రావు తెలిపారు. 4 వ విడుత పట్టణ ప్రగతి కార్యక్రమంలో బుదవారం 6 వ రోజు నగర మేయర్ యాదగిరి సునిల్ రావు, కమీషనర్ సేవా ఇస్లావత్ నగరపాలక సంస్థ అధికారులతో కలిసి నగర వ్యాప్తంగా అధునాత పద్దతిలో నిర్మాణం చేసిన ప్రజా మరుగు దొడ్ల సందర్శించి తనిఖీ చేశారు. నగరపాలక సంస్థ లోని  పబ్లిక్ టాయిలెట్ తో పాటు అంభేడ్కర్ స్టేడియం, కలెక్టరెట్, గీతా భవన్, సర్కస్ గ్రౌండ్ పార్కు, ఐబీ గెస్ట్ హౌజ్, మంచిర్యాల చౌరస్తా, ఎస్ ఆర్ ఆర్ కళాశాల వాటర్ ట్యాంక్, మల్కపూర్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మరుగు దొడ్లను తనిఖీ చేసి పరిశీలించారు. మరుగు దొడ్లలో నిర్వహాకులు పాటిస్తున్న పరిశుభ్రత, వినియోగ దారుల కల్పిస్తున్న సౌకర్యాలను తనిఖీ చేశారు. మహిళ మరుగు దొడ్లలో ఏర్పాటు చేసిన సానిటరీ నాప్కిన్ బర్నింగ్ యంత్రాల పని తీరును పరిశీలించారు. అంతే కాకుండ పలు మరుగు దొడ్లలో నిర్వహాకులు ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఫోన్ పే, గూగుల్ ఫే సౌకర్యంను కూడ పరిశీలించారు. అంతే కాకుండ ఎస్ ఆర్ ఆర్ కళాశాల వద్ద ఉన్న చైతణ్య పురి మార్కెట్ ను సందర్శించి పరిశీలించారు. స్థానికంగా నూతనంగా నిర్మాణం చేస్తున్న మరుగు దొడ్ల పనులను తనిఖీ చేశారు. ఈ సంధర్బంగా మేయర్ సునిల్ రావు మాట్లాడుతూ... నగర వ్యాప్తంగా దాదాపు 1.50 కోట్ల పట్టణ ప్రగతి నిధులు మరియు స్మార్ట్ సిటీ నిధులతో నిర్మాణం చేసిన ప్రజాా మరుగు దొడ్లలో మహిళలు, పురుషుల కోసం అన్ని వసతి సౌకర్యాలు కల్పించి... ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా మరుగు దొడ్ల నిర్వాహాన చేస్తున్నామన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో మరుగు దొడ్లను సందర్శించి వసతి సౌకర్యాలు,  పరిశుభ్రతను తనిఖీ చేశామన్నారు. పరిశుభ్రత, కల్పించే సౌకర్యాల పట్ల టాయిలెట్స్ నిర్వహాకులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.  ప్రతి మరుగు దొడ్డిలో ప్రజలకు కావల్సిన నీటి సౌకర్యం, హైండ్ వాష్ సౌకర్యం, నాప్కిన్ సౌకర్యం, మహిళలకు సానిటరీ నాప్కిన్ సౌకర్యం, నాప్కిన్స్ బర్నింగ్ యంత్రం సౌకర్యాలతో పాటు ఫోన్ పే, గూగుల్ పే సౌకర్యాలను కల్పించడం దరిగిందన్నారు. ప్రతి మరుగు దొడ్డిలో  ఎలాంటి దుర్వాసన రాకుండ పరిశుభ్రతను పాటించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం నగర వ్యాప్తంగా ప్రతి వెయ్యి మంది జనాభాకు అనుగుణంగా ఒక మరుగు దొడ్డిి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంలో నగరంలో అత్యాధునిక టెక్నాలజీతో పరిశుభ్రమైన మరుగు దొడ్లను నిర్మించి వాడుకలోకి తెచ్చామన్నారు. వీటితో పాటు పబ్లిక్ సమావేశాలు, ఫంక్షన్లు, ఇతర జనసందోహంతో కార్యక్రమాలు జరిగే చోట మహిళలకు ఇబ్బంది కలగకుండ ప్రత్యేకంగా ఒక బస్సును టాయిలెట్స్ గా మార్చి మహిళలకు సౌకర్యం కూడ కల్పిస్తున్నామన్నారు. స్మార్ట్ సిటీ నగరంలో ప్రజల కోసంం స్మార్ట్ టాయిలెట్స్ ను ఏర్పాటు చేశామన్నారు. అంతే కాకుండ నగరంలో ప్రజల రిక్వైర్ మెంట్ ప్రకారం ఎక్కడ టాయిలెట్ అవసరం ఉన్న అక్కడ నగరపాలక సంస్థ ద్వారా మరుగు దొడ్ల ను నిర్మాణం చేసేందుకు నగరపాలక సంస్థ సిద్దంగా ఉందన్నారు. నగరపాలక సంస్థ ద్వారా ప్రతి టాయిలెట్ ను అధికారుల పర్యవేక్షణలో ఎజెన్సీ వారిచే వాటి నిర్వాహాన చేయడం జరుగుతుంది. ప్రతి రోజు నగరపాలక సంస్థ అధికారులు పబ్లిక్ టాయిలెట్ ను పరిశుభ్రత విషయంలో విజిట్ చేసి తనిఖీ చేయడం జరుగుతుంది కాబట్టి నగరంలో ఉన్న మరుగు దొడ్లను పరిశుభ్రత కలిగి ఉన్నాయన్నారు. ప్రతి మరుగు దొడ్డిలో రోజు 300 మంది వినియోగించుకునేలా సౌకర్యాలు కల్పించామన్నారు. నగర వ్యాప్తంగా జన సంచారం ఉన్న లోకేషన్లు గుర్తించి ప్రజలకు మరుగు దొడ్ల సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. అంతే కాకుండ నగరంలో మరో రెండు మరుగు దొడ్లను కూడ నూతనంగా నిర్మాణం చేయడం జరుగుతుందని అందులో రాంనగర్ ఫిష్ మార్కెట్ సమీపంలో ఒక టాయివెట్ పనులు పూర్తై ప్రారంభంకు సిద్దంగా ఉందన్నారు.  నగరంలో ఉన్న టాయిలెట్స్ అన్నిటినీ మా నగరపావక సిబ్బంది పరిశుభ్రంగా ఉంచడం జరుగుతుంది... నగరపాలక సంస్థ తరుపున సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నగరంలో పరిశుభ్రమైన రోడ్లు, డ్రైనేజాలతో పాటు మరుగు దొడ్లను కూడ పరిశుభ్రంగా ఉంచి ప్రజలు వాటిని వినియోగించేలా చర్యలు తీస్కుంటామన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల విజ్ఞప్తుల మేరకు అవసరం ఉన్న చోట మరుగు దొడ్లను నిర్మాణం చేస్తామన్నారు. వీక్లీ మార్కెట్ వద్ద కూడ నిర్మాణం చేసేందుకు టెక్నికల్ సాంక్షన్ ఇవ్వడం జరిగిందని... త్వరలోనే పనులు ప్రారంబించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. నగరం వ్యాప్తంగా ఉన్న అన్ని మరుగు దొడ్ల పై నగరపాలక సంస్థ పర్యవేక్షనలో పరిశుభ్ర మైన నిర్వహాణ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ నాగమల్లేశ్వర్ రావు, ఈఈ కిష్టప్ప, మహేంధర్, సానిటేషన్ సూపర్ వైజర్ రాజమనోహార్, ఎన్నిరాల్ మెంట్ ఇంజనీర్ స్వామీ, ఎస్సైలు మహెంధర్, వెంకన్న, గట్టు శ్రీనివాస్, మెప్మా టీఎంసీ అనిత, సీవోలు సునిత, పద్మ, దీప తదితరులు పాల్గొన్నారు.