పట్టణ అధ్యక్షునిగా మూడవసారి ఎన్నకైన ప్రభాకర్ రెడ్డికి శుభాకాంక్షలు

Published: Tuesday September 21, 2021
మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ చింతలబొగుడ రాజమల్లయ్య
వికారాబాద్ బ్యూరో 20 సెప్టెంబర్ ప్రజాపాలన : వికారాబాద్ మున్సిపల్ పట్టణ అధ్యక్షునిగా ముచ్చటగా మూడవసారి ఎన్నికైన దావల్ గారి ప్రభాకర్ రెడ్డికి మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ చింతలబొగుడ రాజమల్లయ్య శుభాభివందనాలు తెలిపారు. సోమవారం మున్సిపల్ పరిధిలోని తేజ ఫంక్షన్ హాల్లో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుల ఎన్నిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిఆర్ఎస్ కార్యకర్తలందరిని సమన్వయపరుస్తూ సామరస్యంగా అందరితో కలుపుగోలుతనంగా ఉన్నందుకు పట్టణ అధ్యక్ష పదవి మూడవ సారి లభించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. పార్టీ అధినాయకత్వం ఆదేశాలను తుచ తప్పకుండా అనుసరించే వ్యక్తి అని కొనియాడారు. పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ టిఆర్ఎస్ పార్టీ సమావేశాలను విజయవంతం చేయడంలో దిట్ట అన్నారు. మర్పల్లి మండల అధ్యక్షునిగా రెండవసారి ఎన్నికైన నాదిరీగ శ్రీకాంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యదీక్ష పట్టుదలతో పార్టీ శ్రేయస్సు కొరకు అహర్నిశలు కృషి చేస్తారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి కె.ఈశ్వర్, మైనారిటీ సెల్ పట్టణ ప్రధాన కార్యదర్శి ముర్తుజా ఆలీ, కొత్తగడి మైనారిటీ సెల్ అధ్యక్షుడు అన్వర్ లు పాల్గొన్నారు.