సిర్గాపూర్ మండలం లో కోటి రూపాయల సిమెంట్ రోడ్లకు శంఖుస్థాపన చేసిన శాసనసభ్యులు

Published: Tuesday February 01, 2022
హైదరాబాద్ 31 జనవరి ప్రజాపాలన ప్రతినిధి: సిర్గాపూర్ మండలంలో కోటి రూపాయల సిమెంట్ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన స్థానిక శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 7 కోట్ల రూపాయల సిమెంట్ రోడ్ల పనులు మంజూరైన సంగతి తెలిసిందే. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా సిమెంట్ రోడ్డు పనులు 2021-22 సంవత్సరంకు 133 సిమెంట్ రోడ్ల పనులకు గాను 7 కోట్ల రూపాయలు నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మంజూరీ చేసినారు.  మారుమూల గ్రామాల్లో పక్కా రోడ్లను తయారు చేయాలనే తలంపుతో రాష్ట్ర  ప్రభుత్వం 2021-22 సంవత్సరంలో సిమెంట్ రోడ్ల ను మంజూరు చేసినది. సిమెంట్ రోడ్ల పనులను వెంటనే ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలని స్థానిక నాయకులకు మరియు అధికారులకు శాసనసభ్యులు సూచించారు. ఇందులో భాగంగా సోమవారం నాడు శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధుల ఆద్వర్యంలో సిర్గాపూర్ మండలం లోని పలు గ్రామాల్లో సిమెంట్ రోడ్ల పనులను కొబ్బరి కాయలు కొట్టి ప్రారంభించారు. కడ్పల్, ఖాజాపూర్, పోచాపూర్, గోసాయిపల్లి, బొక్కాస్ గాం, అంతర్ గాం, ముబారఖ్ పూర్, గరిడే గాం, సుల్తానాబాద్ తదితర గ్రామాల్లో సిమెంట్ రోడ్ల పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు, జిల్లా ప్రాయోజిత సభ్యుడు, మండల ప్రాయోజిత సభ్యులు, స్థానిక సర్పంచ్ లు అధికారులు తదితరులు పాల్గొన్నారు. నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద అధికంగా సిమెంట్ రోడ్ల పనులను మంజూరు చేయించిన స్థానిక శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి కి  పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ధన్యవాదాలు తెలియజేశారు