గ్రేస్ సర్వీస్ సొసైటీ వారి వైద్య సేవలను సద్వినియోగం చేసుకోండి మధిర ఫిబ్రవరి 16 ప్రజాపాలన ప్ర

Published: Friday February 17, 2023
ఆత్కూరు గ్రామంలో ఉచిత హెల్త్ క్యాంపు ప్రారంభోత్సవంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు.క్యాన్సర్ ను మొదటి దశలో గుర్తిస్తే వ్యాధి నుండి బయటపడవచ్చు.ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ మనోరమఆతుకూరు గ్రామంలో కీర్తిశేషులు అబ్బూరి రామకృష్ణ జ్ఞాపకార్థం గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు సర్పంచ్ అబ్బూరి సంధ్యారాణితో కలిసి జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్. ఈ సందర్భంగావారు మాట్లాడుతూ ఖమ్మంలోని గ్రేస్  సొసైటీ వారు జిల్లాలోని ప్రతి గ్రామంలో తిరుగుతూ ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ క్యాన్సర్ పట్ల అవగాహన కలిగి ఉండాలని క్యాన్సర్ వ్యాధికి సరైన టైంలో వైద్యం చేయించుకోవడం వలన వ్యాధి నుండి త్వరగా కోలుకోవాలని అన్నారు.రమ వైద్యశాల డాక్టర్ మనోరమ (గైనకాలజిస్ట్) మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిని మొదటి దశలో గుర్తించటం వలన అపాయం తగ్గుతుందని, తగు జాగ్రత్తలు తీసుకుంటూ మందులు వాడటం చేయటం వలన క్యాన్సర్ నుండి బయట పడవచ్చు అని అన్నారు. గ్రేస్ సొసైటీ వారు అన్ని రకాల వ్యాధులకు ఉచిత సర్వీస్ చేస్తారని గ్రామ ప్రజలు ఉపయోగించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి, టిఆర్ఎస్ మండల కార్యదర్శి బొగ్గుల భాస్కర్ రెడ్డి, యువజన నాయకులు అబ్బూరి రామన్ పాల్గొన్నారు.