దివ్యాంగులకు సదరము క్యాంపు

Published: Tuesday January 31, 2023
* జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి కృష్ణన్
వికారాబాద్ బ్యూరో 30 జనవరి ప్రజాపాలన : దివ్యాంగులకు సదరము క్యాంపు ద్వారా ధ్రువ పత్రాలు జారీ చేయుటకు  మీ సేవా కేంద్రాల ద్వారా జనవరి 31 న స్లాట్ బుక్  చేసుకోవాలని జిల్లా గ్రామీణా అభివృద్ధి సంస్థ అధికారి కృష్ణన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.  క్యాంపులు ఫిబ్రవరి,  02 న OH కేటగిరిలో  CHC వికారాబాదు నందు, 09 న OH కేటగిరి ప్రభుత్వ ఆసుపత్రి తాండూర్ లో,  16 న OH కేటగిరి CHC వికారాబాదు వద్ద, అలాగే 23 ఫిబ్రవరి, 2023 నాడు O. H. కేటగిరి ప్రభుత్వ ఆసుపత్రి తాండూర్  నందు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి క్యాంపుకు 40+10 మొత్తం 50   మంది చొప్పున  ఫిబ్రవరి మాసము 200 మందికి అసెస్ మెంట్ చేయబడుతుందని, ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసినారి.