పాము వల్ల రెండు గ్రామాలకి విద్యుత్ సరఫరా అంతరాయం..

Published: Tuesday July 12, 2022
పాలేరు జూలై 11 ప్రజాపాలన ప్రతినిధి
 
నేలకొండపల్లి: ఓ పాము చేసిన పనికి దాదాపు
350 వ్యవసాయ క్షేత్రాలకు, ఇళ్లకు కరెంట్ బంద్ అయింది. పాము కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో.. వ్యవసాయ మోటార్లు కొన్ని గంటల పాటు పని చేయకుండా ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ ఆ పాము ఏం చేసింది..? పాము విద్యుత్ సరఫరా నిలిపివేయడం ఏంటి? అనే పూర్తి వివరాల్లోకి వెళ్తే. సోమవారం తెల్లవారుజామున ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం సబ్ స్టేషన్ పరిధిలో అమ్మ గూడెం ఫీడర్ లో సోమవారం దాదాపు నాలుగు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది  విద్యుత్ సరఫరా చేసే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ సరఫరా వెళ్లే తీగ పైకి పాము వెళ్ళింది.
సోమవారం తెల్లవారుజామున
ఆ పాము అక్కడ తీగకు చుట్టుకొని సరఫరాకు అంతరాయం ఏర్పడి కరెంటు లేకుండా పోయింది. రాజేశ్వరపురం విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి ఏర్పడింది. రాజేశ్వరపురం ఏఈ అజ్మీరా బాలాజీ, సిబ్బంది పరిశోధకులు అసలు విద్యుత్ సరఫరా నిలిచిపోవడానికి కారణం ఏంటి? అనే కారణాన్ని
అన్వేషించగా. అమ్మ గూడెం ట్రాన్స్ఫార్మర్స్ వద్ద తీగకు పాము చుట్టుకొని ఉండడాన్ని కనుగొన్నారు. వారి చెబుతోన్న వివరాల ప్రకారం.పాము లైవ్
వైర్ను తాకడంతో షార్ట్ సర్క్యూట్ అయ్యింది.
ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆ ప్రాంతంలో పవర్ సప్లై పూర్తిగా నిలిచిపోయినట్టు తెలిపారు. దీంతో దాదాపు 350 వ్యవసాయ క్షేత్రాలకు, గృహాలు, వ్యాపారాలకు విద్యుత్ను పునరుద్ధరించడానికి సుమారు మూడు గంటల సమయం పట్టిందని వెల్లడించారు. పునరుద్ధరణలో లైన్ మెన్ గంగాధర్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ హనుమంతరావు, సిబ్బంది.
పాల్గొన్నారు.