సొంత పనులకు వాడుతున్న పంచాయతీ ట్రాక్టర్

Published: Saturday December 17, 2022
సర్పంచ్, ఉప సర్పంచ్ అండదండలతోనే సొంత పనులకు వాడకం
 
విధులు పట్ల నిర్లక్ష్యంగా పంచాయతీ కార్యదర్శి
 
బోనకల్,డిసెంబర్ 16 ప్రజా పాలన ప్రతినిది: గ్రామీణ పల్లెలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లు మంజూరు చేస్తే గ్రామ అభివృద్ధికి ట్రాక్టర్ ను వినియోగించకుండా ఫ్రీగా వస్తుందని రాయనపేట గ్రామంలోని ఓ రైతు గ్రామపంచాయతీ ట్యాంకర్ ను సొంత పనులకు వాడుకుంటున్నారు.ఏకంగా గ్రామపంచాయతీ ఇంజన్ను తొలగించి తన ఇంజన్ను తగిలించుకొని ట్యాంకర్ ద్వారా నీళ్లు పట్టుకుని వ్యవసాయ పనులకు దర్జాగా వాడుకుంటున్న సంఘటన మండల పరిధిలోని గురువారం వెలుగులోకి వచ్చింది. గ్రామ పంచాయతీల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్ తోపాటు ట్యాంకర్ ను అందజేశారు.ప్రభుత్వం ట్రాక్టర్లను గ్రామపంచాయతీల పరిధి దాటి పోకుండా జిపిఆర్ఎస్ ను కూడా అమర్చడం జరిగింది. కానీ మండల పరిధిలోని రాయన్నపేట గ్రామంలో అధికారులు కనిపెట్టకుండా ఇంజన్ ను తొలగించి వేరొక ఇంజన్ తో ట్యాంకర్ ను గ్రామ సర్పంచ్ అండదండలతో పంచాయతీ గుమస్తా,పంచాయతీ కార్యదర్శి కలిసి ఏకంగా అదే గ్రామానికీ చెందిన ఓ రైతుకు వ్యవసాయ పనులకు ఏకంగా పంచాయతీ ట్యాంకర్ ను అప్పగించారు.ఇదే విషయమై రైతును వివరణ కోరగా రైతు ఘర్షణకు దిగుతూ పంచాయతీ ట్యాంకర్ ను మా ఇష్టం వచ్చినట్లు వంద రకాల పనులకు వాడతాం అంటూ అడిగిన వారితో వాదనకు దిగాడు. అధికారులు ఏం చేస్తారు అంటూ రైతు పంచాయతీ సిబ్బంది కలిసి బెదిరింపులకు పాల్పడుతున్నారు.సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక ప్రైవేట్ ట్యాంకర్ ద్వారా నీళ్లను పెడితే 2000వేల రూపాయలు తీసుకుంటారు.కానీ పంచాయతీ ట్యాంకర్ ను గ్రామ ప్రజల కళ్లు కప్పి ఎవరికీ తెలియకుండా ప్రైవేట్ పనులకు ట్యాంకర్ ను వాడటం పట్ల గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ఏమి తెలియనట్టుగా మౌనంగా ఉన్నారు. పంచాయతీ కార్యదర్శి విధులు పట్ల నిర్లక్షం పలు అనుమాలకు తావిస్తోంది.గత కొన్ని రోజులుగా గ్రామ సర్పంచ్ భర్త కిన్నెర పాపారావు,ఉప సర్పంచ్ రాధాకృష్ణ కనుసన్నల్లోనే ట్రాక్టర్ ను సొంత పనులకు వాడుకుంటున్నారు. ఈ పని గ్రామంలో గత కొన్ని నెలలుగా జరుగుతుందని గ్రామ ప్రజలు వాపోతున్నారు.పంచాయతీ వాహనాలను ప్రైవేట్ వ్యక్తులు సొంత పనులకు వాడుకోవటం పట్ల గ్రామ ప్రజలు బహిరంగానే చర్చించుకుంటున్నారు. ఇలా గ్రామ సర్పంచ్ అండదండలతో గ్రామపంచాయతీ ట్రాక్టర్ ను వాడుకోవడం అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లేనని పలువురు మండిపడుతున్నారు. పంచాయతీ ట్యాంకర్ ను ప్రైవేట్ వ్యక్తులు వాడుకోవడంపై మండల ఉన్నత అధికారులు తక్షణమే స్పందించి రాయనపేట గ్రామపంచాయతీ పై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు. ఈ విషయంపై పంచాయతీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో అని గ్రామ ప్రజలు ముక్తకంఠంతో ఎదురుచూస్తున్నారు.