కోటమర్పల్లిలో ఘనంగా నిర్వహించిన సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

Published: Monday January 24, 2022
వికారాబాద్ బ్యూరో 23 జనవరి ప్రజాపాలన : ఆంగ్లేయులపైకి దూసుకొచ్చిన ఒక బుల్లెట్ సుభాష్ చంద్రబోస్ అని కోటమర్పల్లి సర్పంచ్ విజయలక్ష్మి రాచయ్య అన్నారు. ఆదివారం మర్పల్లి మండల పరిధిలోని కోటమర్పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి రాచయ్య ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఆంగ్లేయుల చెర నుండి భారతీయుల్ని, భారతదేశాన్ని రక్షించుకొనుటకు భారతీయుల్ని సమర పోరాట సైనికులుగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ అని కొనియాడారు. 1879 జనవరి 23న ఒరిస్సాని ఖాట్లాలో జన్మించారని స్పష్టం చేశారు. తల్లి ప్రభావతి బోస్, తండ్రి జానకీనాథ్ అని వివరించారు. చిన్న నాటి నుండి విద్యారంగంలో చురుకైన వాడని ఉద్ఘాటించారు. నేతాజీ శ్రీరామకృష్ణ పరమహంస ఆధ్యాత్మిక మార్గంలో పయనించారని చెప్పారు. 1919లో తత్వ శాస్త్రంలో డిగ్రీని పొందారని గుర్తు చేశారు. నేతాజీ ఇంగ్లాండుకు బయలుదేరిన సమయంలో పంజాబ్ లోని జలియన్ వాలా బాగ్ లో దురదృష్టకర సంఘటన జరిగిందని విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ సోసైటి చైర్మన్ లు, రఘుపతి రెడ్డి, అనంత్ రెడ్డి, జైహింద్ రెడ్డి, రమేశ్ గౌడ్, శ్రీశైలం, కె.నర్సింహ్మ, బిచ్చన్న, మొగులయ్య, వార్డు మెంబర్లు, యువజన సంఘాల నాయకులు, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.