సినీ హీరో అల్లు అర్జున్ ను సన్మానించిన గడ్డం రవికుమార్

Published: Tuesday July 19, 2022
మేడిపల్లి, జూలై18(ప్రజా పాలన ప్రతినిధి)
 సినీ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (బన్నీ )కి ఆగస్టు 21 న్యూ యార్క్ లో జరగనున్న గ్రాండ్ మార్షల్ ఇండియా డే పరేడ్ కు ఫెడరల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఆహ్వానించిన సందర్భంగా సోమవారం తెలంగాణ అల్లు అర్జున్ అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం రవికుమార్ ఆధ్వర్యంలో హీరో బన్నీని కలిసి ఘనంగా సత్కరించారు.భారత దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యూయార్క్ లో ఇండియా డే పరేడ్ కు అల్లు అర్జున్ కు ఆహ్వానం రావడం ఆనందదాయకమని గడ్డం రవికుమార్ పేర్కొన్నారు.అరుదైన ఆహ్వానాన్ని అందుకుని హీరో అల్లు అర్జున్ న్యూ యార్క్ లో నిర్వహించే గ్రాండ్ మార్షల్  ఇండియా డే పరేడ్ లో పాల్గొని  దేశ  ఔన్నత్యాన్ని చాటడం అభినందనీయమని గడ్డం రవి కుమార్ వెల్లడించారు.