దివ్యాంగ క్రీడాకారునికి ఆర్థిక చేయూత అందించిన బి ఆర్ ఎస్ నాయకుడు ఫతే ఆఫన్... హైదరాబాద్ (ప్రజా

Published: Tuesday February 14, 2023
అంగవైకల్యాన్ని జయించి క్రీడల్లో రాణిస్తున్న ఓ దివ్యాంగ క్రీడాకారుడు మహేష్ నాయక్ కి బీఆర్ఎస్ నాయకులు ఫతే అఫన్ ఆర్థిక సహాయం అందించారు. నగరానికి చెందిన మహేష్ నాయక్  చిన్నతనంలోనే చేతిని కోల్పోయినా  త్రో బాల్ ఆటపై ఉన్న ఆసక్తితో మహేష్ పారా త్రో బాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు బాబు వద్ద శిక్షణ పొందాడు. జిల్లా,  రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మహేష్ నేపాల్ రాజధాని ఖాట్మండు లో ఈనెల 19 నుంచి 21 వరకు జరగనున్న పోటీలకు ఎంపిక అయ్యాడు. పోటీలకు  హాజరయ్యేందుకు ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు ఫతే అఫన్ సోమవారం ఆయన కార్యాలయానికి పిలిపించుకొని మహేష్ ను ఘనంగా సన్మానించి 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ప్రమాదంలో చేతిని కోల్పోయి కూడా దేశ ప్రతిష్టను అంతర్జాతీయ వేదికలపై చూపేందుకు వెళ్తున్న మహేష్ లాంటి వ్యక్తికి తన వంతు సహాయం అందించడం ఎంతో సంతోషంగా ఉందని,మహేష్ లాంటి వారిని ఆదర్శంగా తీసుకుని మరింత మంది యువత దేశానికి పతకాలు తెచ్చేలా క్రీడల్లో రాణించాలని అఫన్ అన్నారు. తన ఇబ్బందులను తెలుసుకొని తనకు సహాయ సహకారాలు అందిస్తున్న వారి ప్రోత్సాహంతో దేశానికి పథకం వచ్చేలా కృషి చేస్తానని మహేష్ తెలిపారు. కార్యక్రమంలో  కోచ్ బాబు, ముషీరాబాద్ బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అలందార్ తదితరులు పాల్గొన్నారు.