ఘనంగా కొట్నాక భీమ్ రావు వర్ధంతి వేడుకలు . ఆసిఫాబాద్ జిల్లా, ఆగస్టు29 , ప్రజాపాలన ప్రతినిధి :

Published: Tuesday August 30, 2022

మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఆదివాసీల ముద్దుబిడ్డ కొట్నాక భీమ్రావు 22వ వర్ధంతి వేడుకలు జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్స్ పార్క్ లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాల మధ్య డప్పు వాయిద్యాలతో వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రముఖులు వేడుకలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి, అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయి, భీమ్రావు కూతుళ్లు జిల్లా జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, సరస్వతి, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.