విద్యుత్ శాఖ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్

Published: Tuesday January 24, 2023

చంద్రబోస్ 126 జయంతి వేడుకలు జనవరి 23 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు విద్యుత్ శాఖ సబ్ డివిజన్ వారి ఆధ్వర్యంలో దేశ స్వాతంత్ర సంగ్రామ పోరాట యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి వేడుకలను మధిర విద్యుత్ శాఖ సబ్ డివిజన్ కార్యాలయంలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ శ్రీమతి ఎం. అనురాధఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనంతరం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశం కోసం. భారతావని స్వేచ్ఛ స్వాతంత్ర్యం కోసం పోరాడి అమరులైన యోధులను స్మరించుకుంటూ పరాక్రమ దివస్ గా దేశవ్యాప్తంగా సుభాష్ చంద్రబోస్ జన్మదిన వేడుకలను నిర్వహించుకుంటున్న సందర్భంలో సబ్ డివిజన్ కార్యాలయంలో నిర్వహించుకొనటం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇంజనీర్ కే. లావణ్య, శ్రీధర్, సీనియర్ అసిస్టెంట్ రమేష్, కుమారి, రామకృష్ణ, రోజామణి, లక్ష్మి ,గోపాల్, జీవన్ తదితరులు పాల్గొని నేతాజీకి ఘనమైన నివాళులర్పించారు.