స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా పాఠశాలలో ముగ్గుల పోటీలు

Published: Saturday August 20, 2022
బోనకల్ ,ఆగస్టు 19 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిదిలోని ఆళ్లపాడు గ్రామంలో కూరకుల వేంకయ్య ఐఎఫ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో 75వ స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా కృష్ణ అష్టమి శుభాకాంక్షలు తెలుపుతూ పాఠశాల పీల్లలతో ముగ్గుల పోటిలను నిర్వహించారు. ముగ్గుల పోటీలతో పాటు కృష్ణుని వేషధారణతో శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలని ఆకర్షించే విధంగా ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా హైస్కూల్ పిల్లలో ఉత్సాహాన్ని నింపారు. కార్యక్రమం నిర్వహించిన ఉపాధ్యాయులను గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుబాని, పుష్పవల్లి, శ్రీనివాసరావు, చంద్రశేఖర్ లు విద్యార్థులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area