ప్రమాదకరమైన ముద్ద అంటురోగం పై అప్రమతం చేస్తున్నాం

Published: Friday September 23, 2022
పాలేరు సెప్టెంబర్ 22 ప్రజా పాలన ప్రతినిధి
ప్రమాదకరమైన ముద్ద అంటురోగం పై అప్రమతం చేస్తున్నాం. 
జిల్లాలో నేలకొండపల్లి, రాజేశ్వరపురం, మోటాపురంలో గుర్తించాం. నివారణ కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్. వేణుమనోహార్.
 
నేలకొండపల్లి
 
తెల్ల పశువులల్లో ప్రమాదకరమైన ముద్ద అంటురోగం
 
వ్యాపిస్తుందని...నివారణ కోసం తగు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్. బి. వేణుమనోహర్ తెలిపారు. మండలం లోని రాయగూడెం లో పశు వైద్య శిభిరం ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో ఈ ప్రమాదకరమైన అంటురోగం లక్షణాలు నేలకొండపల్లి, మోటాపురం, రాజేశ్వరపురం గ్రామాల్లో గుర్తించినట్లు తెలిపారు. ఈ రోగం నుంచి పశువులను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ రోగం నివారణ చేయకుంటే తెల్ల పశువులు అంతరించిపోయే ప్రమాదం ఉందని పేర్కోన్నారు. ఇప్పటికే నివారణ కోసం 2 వేల టీకాల ను వేయించే
 
కార్యక్రమం ను చేపట్టినట్లు తెలిపారు. కుత్రిమ గర్భదారణ ఇక నుంచి లింగ
 
నిర్ధారణ కుత్రిమ గర్భధారణ అవసరమైన వాటిని అందించేందుకు చర్యలు
 
తీసుకుంటున్నట్లు తెలిపారు. గోపాలమిత్ర ల సమస్యల ను ప్రభుత్వం
 
పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. వారికి పీఆర్సీ వర్తించేలా జీవో ను విడుదల
 
చేసినట్లు తెలిపారు. దీంతో వారికి రూ.2600 వేతనం అదనంగా
 
అందనున్నట్లు తెలిపారు. అంతే కాకుండా వారికి గుర్తింపు ను ఇస్తున్నట్లు
 
తెలిపారు.రైతులకు మరింత సేవలు అందించేందుకు, రైతులు సందేహాలు
 
నివృత్తి చేసేందుకు, అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఒక
 
యూట్యూబ్ చానల్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు డౌన్లోడ్ చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ కొర్లకుంట్ల నాగేశ్వరరావు, ఈవో కిషోర్, ఎ.డీ. బాను, వైద్యాధికారి డాక్టర్ బీ.రాజు, వైస్ ఎంపీపీ పతానపు నాగయ్య,
 
గోపాలమిత్ర నారాయణ. జెఈవో స్వరూప తదితరులు పాల్గొన్నారు.