వేతనాలు కోసం మిషన్ భగీరథ కార్మికులు ఎదురుచూపులుమూడు నెలలుగా వేతనాలు రాక ఇబ్బంది పడుతున్న క

Published: Thursday July 21, 2022
మధిర జులై 20 ప్రజా పాలన ప్రతినిధితెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో  పనిచేస్తున్న కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో బుధవారం నుండి మిషన్ భగీరథ కార్మికులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 849 గ్రామాలకు త్రాగునీరు సరఫరా నిలిచిపోయింది. మిషన్ భగీరథ పథకంలో ఖమ్మం జిల్లాలో 550 మంది కార్మికులు పనిచేస్తున్నారు. మిషన్ భగీరథ కార్మికులు రేయనక, పగలనక, అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా జోరువానలో సైతం పనిచేసి జిల్లాలో ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకుండా నిరంతరం పని చేస్తున్నారు. మిషన్ భగీరథ స్కీములను 2018 సెప్టెంబర్ నుండి ఎల్ అండ్ టి మరియు ఎన్సిసి కంపెనీలు మెయింటెన్ చేస్తూ మిషన్ భగీరథ పథకం కింద పనిచేసే కార్మికులకు వేతనాలు అందిస్తున్నాయి. ఎన్సిపి కంపెనీ నెల నెల జీతాలు ఇస్తున్నా ఎల్ అండ్ టి కంపెనీ మాత్రం గత మూడు నెలలుగా మిషన్ భగీరథ కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుంది. దీనివల్ల మిషన్ భగీరథ కార్మికుల కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నారు. కార్మికులు ప్రతిరోజు గ్రామాలకు వెళ్లేందుకు 100 నుండి 150 రూపాయల వరకు ఖర్చు అవుతుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు రాకపోవడం వల్ల కార్మికులు విధులు నిర్వహించేందుకు గ్రామాలకు వెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో అప్పులు చేసి విధులకు హాజరవుతున్నారు. గతంలో టిఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఎల్ అండ్ టి, ఎన్సీసీ కంపెనీ ప్రతినిధులతో ఖమ్మంలో డిప్యూటీ లేబర్ కమిషనర్ సమక్షంలో జరిగిన చర్చల్లో మిషన్ భగీరథ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు నెలనెలా వేతనాలు ఇచ్చే విధంగా కార్మికుల జీతాల నుండి కట్ చేసిన బోనస్ను ఇచ్చే విధంగా ఒప్పందం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఈ ఒప్పందాలు అమలు కాలేదని కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మిషన్ భగీరథ కార్మికులకు వేతనాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.వేతనాలు తక్షణమే చెల్లించాలిజల్లేపల్లి బాబురావు* (మిషన్ భగీరథ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు)

మిషన్ భగీరథ పథకంలో పనిచేస్తున్న కార్మికులందరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లేబర్ యాక్ట్ ప్రకారం నెలనెలా వేతనాలు అందించాలని, మిషన్ భగీరథ పథకం కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జల్లెపల్లి బాబూరావు డిమాండ్ చేశారు. మూడు నెలలుగా కార్మికులకు వేతనాలు రాకపోవటంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. మిషన్ భగీరథ పథకాన్ని మెయింటెనెన్స్ చేస్తున్న ఎల్ అండ్ టీ కంపెనీ తక్షణమే వేతనాలు ఇవ్వాలని లేని పక్షంలో ఆందోళనను ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.