రాష్ట్రంలో చిన్న, భారీ పరిశ్రమలకు ప్రభుత్వం చేయాత

Published: Friday April 08, 2022
త్వరలోనే ఆర్యవైశ్య కార్పోరేషన్ ఏర్పాటు
తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీయల్ ఛైర్మన్ అమరవాది లక్ష్మినారాయణ
మంచిర్యాల బ్యూరో, ఎప్రిల్ 07,  ప్రజాపాలన : తెలంగాణ రాష్ట్రంలో చిన్న, భారీ పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంటు అవసరమైన వారికి చేయూతను ఇస్తుందని తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీయల్ చైర్మన్, తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం ఆసిఫాబాద్ కొమురంభీం జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా వెళ్తు మంచిర్యాల విశ్వనాథ ఆలయంలో విలేకరులతో మాట్లాడారు. మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ, పట్టణ వైశ్య సంఘం, యువజన సంఘం, వాసవీక్లబ్బుల ఆధ్వర్యంలో ఆయనకు విశ్వనాథ ఆలయంతో పాటు వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయం, వెంకటేశ్వర ఆలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు ఇరుకుల్ల రామకృష్ణతో కలిసి విలేకయలతో మాట్లాడారు. రైతులు అరుగాలం పండించిన వరిధాన్యంను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుండా మోసం చేస్తుందని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఇరవై నాలుగు గంటలు కరెంటు, నీటి సౌకర్యం కల్పించారని రైతులకు ఆత్మబందువుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం పండించిన పంటను కేంద్రం కొనుగోలు చేయాలని ఒత్తిడి తెచ్చినా కేంద్రం పట్టించుకోక పోవడంతోనే తపప్ప నిసరి పరిస్థితుల్లో అందోళనలు చేస్తున్నట్లు చెప్పారు. రైతుల్లో సిఎంకు మంచి పేరు వస్తుందనే అక్కసుతో కేంద్రం పండించిన పంట కొనకుండా రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు. మన రాష్ట్రంలో పండిన పంట వెంటనే కేంద్రం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని లేకుంటే ఈ నెల 11న ఢిల్లీలో ముఖ్యమంత్రి అధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుందన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే త్వంలో రాష్ట్రంలోని రైస్ మిల్లర్లు యాజమాన్యం, పనిచేసే వారు ధర్నా చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. రాష్ట్రంలో భారీ చిన్న పరిశ్రమల అభివృద్ధికి పరిశ్రమల శాఖ మాత్యులు కేటిఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారని అందుకోసం పది లక్షలతో పరిశ్రమల అభివృద్ధి స్థలాలు ఇవ్వడం జరుగుతుందని అలాంటి పరిస్థితుల్లో కేంద్రం నిర్ణయం సరైంది కాదన్నారు. త్వరలో తెలంగాణలో ఆర్యవైశ్య కార్పోరేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అతి త్వరలోనే ముఖ్యమంత్రి మ్యానిఫెస్టోలో పెట్టినట్లు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాలలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షుడు ముక్తా  శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు రేణికుంట్ల శ్రీనివాస్, కార్యదర్శి విలువేరు శ్రీనివాస్, పట్టణ వైశ్య సంఘం అధ్యక్షుడు దొంతుల ముఖేష్ , కార్యదర్శి అంచూరి నగేష్ కోశాధికారి ముస్త్యాల శ్రీనివాస్, యవజన సంఘం అధ్యక్షుడు కంభంపాటి కమలాకర్, విశ్వనాథ ఆలయ కమిటి అధ్యక్షుడు సిరిపురం శ్రీనివాస్, వాసవిక్లబ్ జిల్లా గవర్నర్ బాల సంతోష్ కార్యదర్శి బోనగిరి వేణుగోపాల్, కోశాధికారి పుల్లూరి బాలమోహన్, మాజీ ఆలయ కమిటీ చైర్మన్ గుండా సుధాకర్, గోలి రాము, వాసవీక్లబ్ రీజియన్ ఛైర్మన్ వుత్తూరి రమేశష్‌, జోన్ ఛైర్మన్ కాచం సతీష్, అధ్యక్షులు కేశెట్టి వంశీకృష్ణ, గౌరిశెట్టి ధనలక్ష్మి, గడ్డం రమేష్ రమాదేవి, మల్యాల యోగేశ్వర్లతో పాటు వైశ్య సంఘాల నాయకులు, యువజన సంఘం నాయకులు, వాసవీక్లబ్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.