లక్సీట్టిపెట్ లో బతుకమ్మ చీరలను పంపిణీ

Published: Saturday October 02, 2021
మంచిర్యాల బ్యూరో, అక్టోబర్ 01, ప్రజాపాలన : లక్సీట్టిపెట్ మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల్ 1, 2, 3 వార్డ్ లలో శుక్రవారం డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ బతుకమ్మ కానుకగా చీరలను మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బతుకమ్మ పండుగ పూట పేద మహిళలు ఆనందంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే మంచిర్యాల నియెజకవర్గంలోని అన్ని మండలాలలో చీరలను పంపిణీ చేయడం జరుగుతుంది అని అన్నారు. ఆడపడుచులు అందరూ సంతోషమం గా ఉండాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మూతై సత్తన్న, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్లా నగబూష్ణం, ఎంపీపీ మంగ చిన్ననన్న, మండల ప్రెసిడెంట్ పింగళి రమేష్, రాకేష్, వార్డ్ మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.