నవంబర్ 12న జాతీయ లోక్ అదాలత్

Published: Saturday October 29, 2022
రాజీమార్గమే రాజమార్గం
* క్షణికావేశములో పగలు ప్రతీకారాలు పెంచుకోవద్దు
* వికారాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే సుదర్శన్
వికారాబాద్ బ్యూరో 28 అక్టోబర్ ప్రజా పాలన : వికారాబాద్ జిల్లా కోర్ట్ న్యాయ సేవాసంస్థ ఆద్వర్యంలో  నవంబర్ 12 వ తేదీన శనివారము జాతీయ లోకాదలత్  నిర్వహిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా  ప్రధాన న్యాయమూర్తి  కె సుదర్శన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయ సేవాసంస్థ అద్వర్యంలో లోకదాలత్ నిర్వహించడం  జరుగుతుందని స్పష్టం చేశారు. దీర్ఘకాలిక అపరిస్కృత కేసులు ఏమైనా ఉంటే ఇరువర్గాలను రాజీ కుదుర్చుకునే అవకాశం కల్పించాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వెల్లడించారు. 
రాజీ మార్గమే రాజమార్గమని హితవు పలికారు.  రాజీపడడము వలన ఇద్దరు గెలిచినట్లేనని తెలిపారు. పంతాలకు పోయి చిన్న చిన్న తగాదాలతో పోలీసు స్టేషన్ లు కోర్టుల చుట్టూ తిరుగుతూ మీ సమయాన్ని, డబ్బును అనవసరంగా వృధా చేసుకోరాదని స్పష్టం చేశారు. తొందర పాటున పెట్టిన కేసులలో తమ తప్పును తెలుసుకుని రాజీపడి కలిసిమెలిషి ఉండేవిధంగా  రెండునెలలకు ఒకసారి జాతీయ లోకదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించారు. 
ఈ కార్యక్రమానికి సంబంధించిన అధికారులు, వికారాబాద్ అడ్వకేట్ బార్ న్యాయవాదులు అధిక సంఖ్యలో పాలుగొని జాతీయ లోకదాలత్ లో ఎక్కువ కేసులు రాజీపడే విధంగా చూడాలని ప్రధాన న్యాయమూర్తి కోరారు.