హౌస్ పెయింటర్ కార్మికులు 30 మంది చేరిక

Published: Tuesday April 06, 2021
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు, ఏప్రిల్ 5, ప్రజాపాలన ప్రతినిధి : గత పది సంవత్సరాల నుండి నెల్లికుదురు మండలం లో రోజువారి కార్మికులుగా పని చేస్తున్నాము అందరం కలిసికట్టుగా మండలా ఏ ఐ టి యు సి కార్మిక సంఘం లో చేరినాము, ఏ ఐ టి యు సి అనేక సంఘటిత అసంఘటిత కార్మికుల తరఫున ముందుండి అనేక పోరాటాలు చేసిన ఘనత ఏ ఐ టి యు సి ఉందని హౌస్ పెయింటర్ కార్మిక సోదరులు తెలిపారు మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శంకర్ ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి వారి పల్లి వెంకన్న మాట్లాడుతూ ఏఐటీయూసీ భారతదేశంలో మొట్టమొదటి కార్మిక సంఘంగా వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని అనేక పోరాటాలు నాంది పలికింది ఈ యొక్క కార్మికులను ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు అందించాలని వీరికి ప్రమాదవశాత్తు 10 లక్షలు ఇన్సూరెన్స్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం, అని కోరారు ఈ కార్యక్రమంలో హౌస్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ కమిటీ సభ్యులు అధ్యక్షులుగా బైరు శ్రీనివాస్ కార్యదర్శిగా కస్తూరి బాలకృష్ణ ఉపాధ్యక్షులుగా రవీందర్ వెంకన్న కోశాధికారిగా గోడిశాల ముఖేష్ సలహాదారులుగా బిర్రు లక్ష్మయ్య రాగి అశోక్ సహాయ కార్యదర్శిగా గొల్లకొండ బాలకృష్ణ ఎన్నిక కావడం జరిగింది కార్యవర్గ సభ్యులు యం, శ్రీనివాస్  ఈ, గణేష్ ఈ, మురళి కె, నగేష్ వి, లక్ష్మణ్ బి, వెంకటేష్ ఈ, ఉపేందర్ వి, కృష్ణ ఈ, యాకన్న బి, నాగరాజుపి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు