నీటి బావులపై జాలీలను ఏర్పాటు చేయాలి

Published: Friday August 20, 2021
కామారెడ్డిగూడ గ్రామంలో రోడ్లపై మురికి నీరు ప్రవహించకుండా తగిన ఏర్పాటు చేయాలి
పీరంపల్లి గ్రామంలో మోరీలు రోడ్ల నిర్మాణం చేపట్టాలి
పంటలు పూర్తిగా నాశనమైన రైతులను గుర్తించాలి
మీతో నేను కార్యక్రమంలో భాగంగా కామారెడ్డిగూడ, పీరంపల్లి గ్రామాలలో పర్యటించిన ఎమ్మెల్యే
వికారాబాద్ బ్యూరో 19 ఆగస్ట్ ప్రజాపాలన : క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకొని పరిష్కరించడమే లక్ష్యంగా మీతో నేను కార్యక్రమం చేపట్టానని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం వికారాబాద్ మండల పరిధిలోని కామారెడ్డి గూడ, పీరంపల్లి గ్రామాలలో మీతో నేను కార్యక్రమంలో భాగంగా గ్రామాల సర్పంచులు సామల పురుషోత్తం రెడ్డి, జయమ్మ నరేందర్ రెడ్డిల ఆధ్వర్యంలో వీధి వీధి తిరుగుతూ అపరిష్కృత సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కామారెడ్డి గూడ గ్రామ పర్యటనలో ...
కైల మల్లమ్మ ఇంటి నుండి నల్ల సాయిరెడ్డి ఇంటి వరకు సిసి రోడ్డు నిర్మించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. నల్ల బక్కారెడ్డి, రిక్కల గోపాల్ రెడ్డిల ఇండ్ల ముందు ఉన్న బావులపై వెంటనే జాలీలు బిగించాలని సూచించారు. సిసి రోడ్లపై మురికి నీరు ప్రవహించడంతో ఇండ్ల నుండి బయటికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నామని నివాసాల ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. గ్రామ ప్రవేశ రోడ్డు నిర్మాణానికి అంచనా వ్యయం వేయాలని పిఆర్ ఏఈ చాణక్యరెడ్డికి సూచించారు. గ్రామంలో ఆసరా పెన్షన్ కొరకు 14 మందిలో 9 మంది దరఖాస్తు చేసుకోగా మిగిలిన వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. కామారెడ్డిగూడ నుండి పాతూర్ వరకు రోడ్డు నిర్మాణానికి అంతనా వేయాలని పిఆర్ ఏఈకి సూచించారు. ప్రాథమిక పాఠశాలలో సంఖ్య పెంచాలని పేర్కొన్నారు. గ్రామ అధికారులు అపరిష్కృత పనుల పరిష్కారంలో చూపే శ్రద్ధ ప్రశంసనీయమని కొనియాడారు. మిషన్ భగీరథ నీరు త్రాగేలా ప్రజలకు అవగాహన కల్పించాలని వివరించారు. స్మశాన వాటికకు సంబంధించిన స్థలాన్ని సర్వే చేసి, హద్దులు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం వైకుంఠధామం, పల్లె ప్రకృతివనం సందర్శించారు. 
పీరంపల్లి గ్రామ పర్యటనలో...
పశువులకు సంబంధించి నిరుపయోగంగా పడి ఉన్న ట్రేవిస్ స్టాండ్ ని వేరే ప్రదేశంలోకి మార్చి ఉపయోగంలోకి తీసుకురావాలని సూచించారు. పశువుల వైద్యులు గ్రామాన్ని సందర్శించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పశువుల డాక్టర్ సురేందర్ గ్రామానికి వచ్చినప్పుడల్లా రైతుల వద్ద సుమారు రూ.500 లు తీసుకుంటున్నాడని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. పొలాలలోని విద్యుత్ వైర్లు చేతికి అందేలా వేలాడుతున్నాయని రైతులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. విద్యుత్ వైర్లను వెంటనే సరిచేయాలని విద్యుత్ అధికారి ఏఈ రాంనాథ్ కు సూచించారు. ప్రతి ఇంటికి నళ్ళా కనెక్షన్ ఎందుకు ఇవ్వలేదని మిషన్ భగీరథ ఏఈ రవిని ప్రశ్నించారు. కావలి మాణిక్యం ఇంటి పక్క నుండి మోరీ నిర్మాణం చేపట్టాలని సర్పంచ్ జయమ్మకు సూచించారు. బందెన్నోల్ల భాగ్యమ్మ ఇంటి ముందు నుండి మోరీ నిర్మాణం చెపట్టాలని తెలిపారు. కుర్వ నారాయణ ఇంటి నుండి సావాద మల్లయ్య ఇంటి వరకు సిసి రోడ్డు నిర్మాణం చేయాలని అన్నారు. గుట్ట నుండి వచ్చే నీటికి కాలువ నిర్మించాలని పేర్కొన్నారు. నారెగూడెం గోపాల్ రెడ్డి, రంగారెడ్డి ల ఇండ్ల ముందు మోరీ నిర్మాణం లేకపోవడంతో ఈగలకు దోమలకు ఆవాస కేంద్రాలుగా మారనున్నాయని హెచ్చరించారు. మిషన్ భగీరథ నీటిని సక్రమంగా సరఫరా చేయాలని ఏఈ రవికి సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ప్రమోదినిరెడ్డి, ఎంపిపి కామిడి చంద్రకళ, ఎంపిడిఓ సుభాషిణి, ఎంపిఓ నాగరాజు, ఏఎంసి విజయ్ కుమార్, డిప్యూటి ఎంఆర్ఓ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.