ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పెన్షన్లు పంపిణీ చేస్తాం: జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు

Published: Saturday September 03, 2022
బోనకల్, సెప్టెంబర్ 2 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని రావినూతల గ్రామంలో నూతనంగా మంజూరైన పెన్షన్లను జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు శుక్రవారం రైతు వేదికలో పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమం కోసం ఎంతటి ఆర్థిక భారానైన భరించటానికి సిద్ధంగా ఉన్నారని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు. కుటుంబం లోని పెద్దకొడుకుల 2116/-రూపాయలు అందిస్తున్నారని ఇప్పుడు కొత్త పెన్షన్లు కూడా ఇవ్వడం జరుగుతుందని, సాంకేతిక సమస్యలు పరిమితుల పేరుతో ప్రజలను ఇబ్బందుల పాలు చేయొద్దని వారు అన్నారు. నూతన పెన్షన్లు పంపిణీ చేయడం వలన వృద్ధులు, వితంతువులు,వికలాంగులు ఆనందం తో ఉన్నారని, కావున మనమందరం సీఎం కేసీఆర్ కు అండగా ఉండాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు చేబ్రోలు మల్లికార్జునరావు,కార్యదర్శి మోదుగుల నాగేశ్వరరావు, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, మాజీ అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు, మాజీ జడ్పిటిసి బానోతు కొండ, రావినూతల సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్, ఉప సర్పంచ్ బోయినపల్లి కొండలు, మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ జమాలుద్దీన్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు మూడవత్ సైదా, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ సైదా, పెంటు సాహెబ్, టిఆర్ఎస్ నాయకులు తన్నీరు పుల్లయ్య, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
 
 
 
Attachments area