చెర వేగంగా చెన్నూర్ లో అభివృద్ధి పనులు. ప్రజల మన్ననలు పొందుతున్న ఎమ్మెల్యే బాల్క సుమన్.

Published: Friday May 27, 2022
మంచిర్యాల బ్యూరో, మే 26, ప్రజాపాలన:
 
అపార ఖనిజ సంపద తోపాటు దట్టమైన అడవి, ఇరువైపులా జలజలపారే ప్రాణహిత, గోదారమ్మల పరవళ్ళు. సారవంతమైన పంట భూములు అన్నీ ఉన్నా  అభివృద్ధి లో ఆమడ దూరంరో నెట్టేయబడింది చెన్నూరు నియోజక వర్గం. ఐతే ఇది ఒకప్పటి మాట ప్రస్తుతం ప్రభుత్వ విఫ్ ,ఎమ్మెల్యే  బాల్క సుమన్ ఈ నియోజకవర్గంలో అడుగు పెట్టడంతో ఈ ప్రాంత దరిద్రం పారిపోయిందని చెప్పుకోవచ్చు. నియోజకవర్గంలో సింగరేణి సంస్థ, సింగరేణి ధర్మల్ పవర్ ప్లాంట్, ఓపెన్ కాస్ట్ , సోలార్ ప్లాంట్స్ మొదలగు పరిశ్రమలతో నిండి ఉంది.
కోట్ల రూపాయల నిదులు వరల్లా తీసుకుని వచ్చి  ప్రజా సంక్షేమం తో పాటు శాస్వత అభివృద్ధి పనులు వేగవంతం చేశారు.దీంతో స్థానిక ప్రజల మన్ననలు పొందుతున్నారు.
 
* సంక్షేమం - సామాజిక సేవా
 
1) బాల్క పౌండేషన్ ఏర్పాటు చేసి సేవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
 నిరుద్యోగులకు గృప్ వన్ ,గృప్2 పోటీ పరీక్ష లకోసం ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి, శిక్షణ స్టడీ మెటీరియల్స్ అందజేశారు.
2) నియోజకవర్గంలో డాక్టర్. బి.ఆర్. అంబేద్కర్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు  కేంద్రం జిల్లాకే తలమానికంగా 
గా చెప్పుకోవచ్చు.
.
 3) సంప్రదాయక వ్యవసాయం నుంచి రైతులను వాణిజ్య పంటలు పండించే దిశగా  జిల్లాలో ఫామాయిల్ తోటల  ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. 
 
4) చెన్నూరు నియోజకవర్గం లోని భూములను సస్యశ్యామలం చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం తో మాట్లాడాలి ఒక లక్ష ఎకరాలకు సాగు నీరు, తాగునీరు అందించడం కోసం  కృషిచేశారు.
5) ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నియోజకవర్గంలోని ప్రజలకు ఆర్థిక పరమైన సహాయాన్ని అందిం చడంతోపాటు, నియోజకవర్గ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ ,ఆసరా పెన్షన్, దళిత బందు ప్రజలకు అందించడంలో  మంచి మనస్సున్న నేతగా పేరు పొందారు.