బ్యాంకు వలన రైతులకు కలిగే ఉపయోగాలు పై అవగాహన

Published: Thursday September 30, 2021
సహకార సంఘం బ్యాంక్ మేనేజర్ తిరుపతి
వెల్గటూర్, సెప్టెంబర్ 29 (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ మండలం ముత్తు నూర్ గ్రామములో సహకార సంఘం బ్యాంక్ మేనేజర్ తిరుపతి గ్రామ సర్పంచ్ అనుమల తిరుపతి ఆధ్వర్యంలో రైతులకు బుధవారం రోజు వ్యవసాయ పనిముట్ల పై రుణ సౌకర్యం ఉందని అలాగే గృహ నిర్మాణానికి, వాహనం కొనుగోలుకు సంబంధిత పత్రాలు సమర్పిస్తే రుణాలు మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. బంగారు ఆభరణాలు పెట్టుకొని రుణ సదుపాయం ఉపయోగించుకోవాలి ఇట్టి పై తక్కువ వడ్డీఉంటుందని ఈ సౌకర్యాన్ని రైతులు ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి బీమా సౌకర్యం వలన లాభాలున్నాయి సౌకర్యాన్ని ఉపయోగించుకునే విధానం రైతులకు అవగాహన కల్పించారు. సహకార సంఘం డైరెక్టర్ సింగం రమేష్, రైతులు గోల్ల సత్యం, చేపూరి భూమయ్య, బైరం శ్రీనివాస్, సంఘ శ్రీధర్, బ్యాంకు  సిబ్బంది C.E.O పుట్టపాక రాజయ్య, ఆడిట్ అధికారి ప్రవీణ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.