ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

Published: Tuesday June 22, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : చందానగర్ లోగల సూపర్ విజ్ జూనియర్ కళాశాల ఆవరణలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 7వ అంతర్జాతీయ యోగా దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా గురువు శ్రీ వి.రామారావు గారు యోగాసనాలు వేసి అందరికి నేర్పించటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మరియు యోగా గురువు వి రామారావులు హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా యోగా వలన కలిగే ప్రయోజనాలన, యోగా ఆవశ్యకతలను అందరికి వివరించి యోగా పట్ల అవగాహన పెంపొందించి అందరూ కూడా ఆరోగ్య వంతమైన జీవన విధానాన్ని అవలబింపజేయటానికి చేసే ప్రయత్నమే ఈ యోగా దినోత్సవం అని అన్నారు. యోగా అంటే మనసుని శరీరంను ఏకం చేయటమేనని, యోగం అంటే కలయిక అని తెలిపారు. యోగా అనగా ఆసనాలు, ప్రాణయామం, ధ్యానం. యోగాసనాల వలన శరీరం దృఢంగా ఉంటదని తెలిపారు. ప్రాణయామం వలన మనం పేల్చే గాలి శరీరంలో అన్ని భాగాలకు వెళ్లి రక్తప్రసరణ బాగా జరిగి శరీరం ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటదని తెలిపారు. ధ్యానం వలన మానసిక రుగ్మతలు తగ్గి మానసిక ప్రశాంతత ఏర్పడతుందని తెలిపారు. యోగా చేయడం వలన శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా దృఢంగా ఉండి ఆరోగ్య వంతమైన ప్రశాంత జీవనం గడపటానికి ఎంతగానో యోగా ఉపయోగ పడతుందని తెలిపారు. యోగా మన సనాతన జీవనశైలి. కులమతాలకు అతీతంగా అందరూ తమ దినచర్యలో భాగంగా యోగా చేయాలన్నారు. మన పూర్వీకులు మనకు అందించిన ఆరోగ్య వరప్రదాయినయిన యోగాని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ పాటించి ఆరోగ్యవంతులుగా ఉండటానికి ఐక్యరాజ్య సమితి వారు తీర్మానం చేసి ప్రపంచ వ్యాప్తంగా 2015 సంవత్సరం నుండి అమలు పరచే చర్యలు చేపట్టారన్నారు. కావున ప్రతి ఒక్కరూ కూడా మన సనాతన జీవనశైలిలో భాగమైన యోగాని ఆచరించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రామ్మోహనరావు, సుధాకర్, యోగా టీచర్ నాగమణి, జనార్దన్, విష్ణుప్రసాద్, వాణిసాంబశివరావు, సురేష్ బాబు, పొలా కోటేశ్వరరావు గుప్తా, విజయలక్ష్మి, రజని తదితరులు పాల్గొన్నారు