ఆదర్శ పాఠశాల విద్యార్థినులకు దుప్పట్లు పంపిణీ *

Published: Saturday December 17, 2022
జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ **
 
ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 16 (ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహంలో విద్యార్థినిలకు గురువారం దుప్పట్లు పంపిణీ చేశారు. వసుధ స్వచ్ఛంద సంస్థ మరియు జిల్లా ఎస్పీ చొరవతో వసతి గృహంలోని విద్యార్థినిలకు చలి నుండి రక్షణ కోసం 100 దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) అచ్చేశ్వర్ రావు, టాక్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సుధాకర్, ప్రిన్సిపాల్ అబ్దుల్ కలీం, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.