*కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ అణగారిన వర్గాలను మొండి చెయ్యి*

Published: Friday February 03, 2023
మంచిర్యాల టౌన్, ఫిబ్రవరి 02, ప్రజాపాలన : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ అణగారిన వర్గాలను మొండి చెయ్యి అని  తెలంగాణ పద్మశాలి విద్యార్ధి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేరాల వంశీ అన్నారు. జిల్లా కేంద్రంలోని గల ప్రభుత్వ కళాశాల ఆవరణంలో తెలంగాణ పద్మశాలి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గురువారం  మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ లో ఎస్ సి, ఎస్ టి, బిసి లకు మొండి చేయి చూపించారు, దేశ వ్యాప్తంగా అణగారిన వర్గాలను కేంద్ర ప్రభుత్వం  అవమాన పరిచిందిని అన్నారు. కేంద్రంలోని బీజేపీ మోడీ పాలనలో అన్యాయం, వివక్ష  కూడిన ఈ కేంద్ర బడ్జెట్ నిదర్శనం, రైతు, ఉద్యోగులు, ఉపాధి హామీ కూలీలకు ఈ బడ్జెట్ వ్యతిరేకంగా ఉన్నదని కేవలం ఈ బడ్జెట్ కార్పొరేట్ వ్యవస్థ కు కొమ్ము కాసే విధంగా ఉందని కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ వ్యవసాయంతో పాటు ఇతర రంగాలను పట్టించు కోలేదని
దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టే విధంగా బడ్జెట్‌ వుందని అన్నారు.
వంట నూనెలు, పెట్రోల్, డిజిల్ తో పాటు ఇతర నిత్యావసర ధరలు ఈ బడ్జెట్ లో పెరగడంతో   పేద, మధ్యతరగతి వర్గాల ఆశలు గల్లంతయ్యాయి వెంటనే కేంద్ర బడ్జెట్ ను పున: సమీక్షించాలని డిమాండు చేశారు.ఈ కార్యక్రమంలో రాజు, సూరజ్, సురేష్, నరేశ్, విజయ్,హరీశ్ తదితరులు పాల్గొన్నారు.