ఉద్యోగ విరమణ పెంపు నిర్ణయం మానుకోవాలి

Published: Monday March 29, 2021

ఎంఎస్పి జిల్లా కన్వీనర్ పూల బోయిన మొండయ్య
ఆసిఫాబాద్ జిల్లా మార్చి28 ప్రజాపాలన, ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ వయస్సును 58 నుండి 61 సంవత్సరాలకు పెంచుతూ తీసుకొన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఎం ఎస్పి జిల్లా కన్వీనర్ పూల బోయిన మొండయ్య డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌక్ ఎదుట నిర్వహించిన విలేకరుల సమావేశంలో మొండయ్య మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు విరమణ వయసు 58 నుండి, 61 సంవత్సరాలకు పెంచడం దారుణమన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో నిరుద్యోగం తండా విస్తోందని అన్నారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాక పోవడంతో యువత మనోవేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ భారముతో చిన్న చిన్న పనులు చేస్తున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి వెంటనే అందించారని కోరారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎం ఎస్పి జిల్లా కోఆర్డినేటర్ రేగుంట మహేష్, నాయకులు గణేష్ అంకుల్, మెగాజీ, తదితరులు పాల్గొన్నారు.