సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

Published: Saturday July 16, 2022

 మధిర రూరల్ జులై 15 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో శుక్రవారం నాడు సీజన్ వ్యాధులతో  పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నియోజకవర్గం స్పెషల్ ఆఫీసర్ మరియు జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ వి సుబ్బారావు సూచించారు శుక్రవారం మండల పరిధిలోని నాగవరప్పాడు నిదానపురం గ్రామాల్లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహాల్లో నిలువ నీరు లేకుండా ప్రతిరోజు డివాటరింగ్ చేసుకోవాలని,ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. దోమలు వృద్ధి చెందకుండా  జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. దోమగుడ్డు దశలోనే నివారించాలని తద్వారా దోమల ఉత్పత్తిని ఆపవచ్చని ఆయన తెలిపారు. నిదానపురం గ్రామంలో జరుగుతున్న బూస్టర్ డోస్ టీకా కార్యక్రమమును తనిఖీ చేసి రికార్డును పరిశీలించి గ్రామంలో వందకు వందశాతం టీకాలు పూర్తయినందుకు అభినందించారు. 18 సంవత్సరాల దాటిన అందరూ ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్  ఫోర్త్ వేవ్ ఉన్నందున కచ్చితంగా కోవిడ్ టీకాలు తీసుకొని రక్షణ పొందాలని ఆయన కోరారు. మాటూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో మాటూరుపేట పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్ ఆరోగ్య పర్యవేక్షకుడు భాస్కరరావు, సుభాషిని సెక్రటరీ శ్రీహరి మహిళా ఆరోగ్య కార్యకర్తలు మరియమ్మ సిహెచ్పి రాజ్యలక్ష్మి ఆశా కార్యకర్తలు వేము పద్మ వాణి పాల్గొన్నారు.

 
 
 
 
Attachments area