రైతులు పండించిన పంటలకు మద్దతు ధర సాధించేవరకు పోరాటం

Published: Friday December 16, 2022
జన్నారం, డిసెంబర్ 15, ప్రజాపాలన: రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఎం.ఎస్.పి సాధించేందుకు పోరాటాన్ని ఆపమని రైతు సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు సంకే రవి అన్నారు. మండల కేంద్రంలో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల సవతీ తల్లి ప్రేమను  ప్రదర్శిస్తూదన్నారు. రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. రైతులు పండించిన ప్రతి పంటకు మద్దతు ధర చెల్లించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పిఎసిఎస్, ఐకెపి ద్వారా నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మంచినీటి సౌకర్యంతో పాటు నీడ సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారన్నారు. రైతులు ఉదయమే వచ్చి పండించిన వడ్లను కబుర్లు ఆరబోసుకొని మండుటెండలో కూర్చొని అడికాకులు కావలసిన పరిస్థితులు ఉత్పన్నమవుతుదన్నారు. దీంతో వరి సెంటర్లో ఎండకు మంచినీటి ఎండకు మంచినీటి సౌకర్యం లేక రైతులు తీవ్ర అవశలు పడుతుందన్నారు. అధికారులు స్పందించి సదుపాయాలు కల్పించాలని రైతులు వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు