సమాజసేవలో మేము సైతం అంటున్న జగిత్యాల యువకులు.

Published: Thursday January 19, 2023

జగిత్యాల, జనవరి 18 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల పట్టణానికి చెందిన ఎలుగందుల శ్రీనివాస్, ఎలిగేటి కరణ్ కుమార్ మరియు పుట్ట రవికాంత్ లు దివ్యాంగునికి కృత్రిమ చేయిని ఉచితం గా అందజేసినారు. పట్టణానికి చెందిన అయ్యోరి అరుణ్ కుమార్ పోలియో తో  చేయి  పూర్తిగా లేకపోవడంతో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల వారి పరిస్థితిని చూసిన  ఎలుగందుల శ్రీనివాస్, ఎలిగేటి కరణ్ కుమార్ లు  అతనికి కృత్రిమ చేయిని అందించాలనే సంకల్పంతో  ఉన్నత విద్యనభ్యసించి కాలిఫోర్నియాలో స్థిరపడ్డ తన మిత్రుడు పుట్ట పద్మా రవికాంత్ సహకారంతో ముగ్గురూ కలిసి ఒకలక్ష యాభై వేల రూపాయల ఆధునిక టెక్నాలజీతో రూపొందించబడిన, 2 వీలర్ మరియు కారు నడుపుటకు అనువుగా ఉన్న, సుమారు 4 కేజీల బరువు లేపగల సామర్థ్యం కలిగి ఉన్న సిలికాన్ మేయో ఎలక్ట్రిక్ హ్యాండ్ ను ఉచితంగా అందజేసినారు. వారు మాట్లాడుతూ ఆపదలో ఉన్న బీదవారిని మేము ఆదుకుంటామని  గతంలో  విద్యుదాఘాతంతో రెండు చేతులు కోల్పోయిన అల్లీపూర్ కు చెందిన మహమ్మద్ అషు కు మరియు ఇటిక్యాల కు చెందిన కాసల రవి కి ఆధునిక కృత్రిమ చేతులు ఉచితంగా అందించదమే కాక కరోనా సమయంలో  నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాలు చేసినారు. ఆపదలో ఉన్న నిరుపేద దివ్యాంగులకు సహాయంగా నిలుస్తామని తెలిపారు. వారికి అయ్యోరి అరుణ్ కుమార్ కుటుంబ సభ్యులు  కృతజ్ఞతలు తెలిపినారు.