గ్రామీణ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలన

Published: Thursday July 21, 2022
ఎన్ఐఆర్డిపిఆర్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ చిమన్కర్ దిగంబర్
వికారాబాద్ బ్యూరో 20 జూలై ప్రజాపాలన : జాతీయ ఉపాధి హామీ పనుల అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చామని ఎన్ ఐ ఆర్ డి పి ఆర్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ చిమన్కర్ దిగంబర్ అన్నారు. బుధవారం వికారాబాద్ మండల పరిధిలోని పులుమద్ది గ్రామంలో గ్రామ సర్పంచ్ తిమ్మాపురం మాధవరెడ్డి, కార్యదర్శి మర్రి షాహేందర్ రెడ్డి, ఎంపీపీ కామిడి చంద్రకళ కమాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీడీవో మల్గ సత్తయ్య, ఎంపీ ఓ నాగరాజుల సమక్షంలో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ పనులు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించారు. జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ రాజేంద్రనగర్ నుండి 35 మంది చతిస్గడ్ బీహార్ జార్ఖండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ గుజరాత్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ హర్యానా రాష్ట్రాల నుండి శిక్షణ బృంద సభ్యులు వచ్చారు. గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు గ్రామస్థాయిలో ఎలా అమలవుతున్నాయో పులుమద్దిలో క్షేత్రస్థాయి పర్యటన ద్వారా తెలుసుకున్నారు. గ్రామంలో మల్టీ లెవెల్ అవెన్యూ ప్లాంటేషన్, ఎవెన్యూ ప్లాంటేషన్, పల్లె ప్రకృతి వనం, తడి పొడి చెత్త నిర్వహణ కేంద్రం, కమ్యూనిటీ ప్లాంటేషన్, వైకుంఠధామం, గ్రామ నర్సరీ, గ్రామంలోని రైతు విక్రం రెడ్డి పొలంలో కూరగాయల పందిరి, పశువుల పాక మరియు  బృహత్ పల్లె ప్రకృతి వనం లను పరిశీలించారు. జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ రాజేందర్ నగర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చిమన్కర్ దిగంబర్ నేతృత్వంలో శిక్షణ పొందుతున్న పలు రాష్ట్రాలకు చెందినవారు. వీరిలో బీడీవోలు, డిపిఓ లు, డిఆర్డిఓలు ఉన్నారు. గ్రామంలో చేసిన పనులన్నీ అద్భుతంగా చేశారు అని గ్రామపంచాయతీ సిబ్బందిని ప్రశంసించారు. సర్పంచ్ మరియు వారి కార్యవర్గం అద్భుతంగా గొప్పగా పనిచేస్తుందని అభినందించారు. గ్రామపంచాయతీ ఆఫీస్ కార్యాలయంలో ఉపాధి హామీకి సంబంధించిన ఏడు రిజిస్టర్ లను తనకి  తనాఖీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బాచుపల్లి అనసూయ ప్రభాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ నల్ల అమృతమ్మ చంద్రయ్య, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ నవీన్ కుమార్, టెక్నికల్ అసిస్టెంట్స్ భీమయ్య, రవి ,ఝాన్సీ, ఉపాధి హామీ మేట్ కిష్టయ్య, పంచాయితీ కార్మికులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.