మధిర మున్సిపాలిటీలో ముమ్మరంగా అభివృద్ధి పనులు

Published: Tuesday December 13, 2022

మధిర  డిసెంబర్ 12 (ప్రజా పాలన ప్రతినిధి) మధిర మున్సిపాలిటీలో ముమ్మరంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్  రాజు పేర్కొన్నారు. మధిర మున్సిపాలిటీలో నూతనంగా ఏర్పాటుచేసిన విద్యుత్ లైట్లను మున్సిపల్ చైర్ పర్సన్ మొండి తోక లతతో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో  తెలంగాణ కష్టాలు తెలిసిన వ్యక్తి కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం వలన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతోందన్నారు.టిఆర్ఎస్ పాలనలో మధిర మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.  మధిర చెరువు కట్టను ట్యాంక్ బాండగా మార్చే నిర్మాణం పనులు సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. అంబేద్కర్ సెంటర్ సుందరీకరణ, సెంటర్ లైటింగ్ లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగిందన్నారు. మధిర ల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను అతి త్వరలోనే రాష్ట్ర మంత్రులు కేటీఆర్ పువ్వాడ అజయ్ ఎంపీ నామ నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తామని ఆయన తెలిపారు. మధిర అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ఐటి మరియు పురపాలక శాఖ కల్వకుంట్ల తారక రామారావుకి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శీలం విద్యాలత వెంకటరెడ్డి మదిర మున్సిపాలిటీ కమిషనర్ అంబటి రమాదేవి మున్సిపల్ కౌన్సిలర్ మేడికొండ కళ్యాణి సొసైటీ అధ్యక్షులు బిక్కి ప్రసాద్ కరివేద సుధాకర్, కనుమూరి వెంకటేశ్వరావు జేవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.