జిల్లా లో ప్రజా రవాణా బంద్ విజయవంతం.

Published: Friday May 20, 2022
 మంచిర్యాల టౌన్, మే 19, ప్రజాపాలన : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్ర రవాణా బందులో భాగంగా జిల్లా కేంద్రంలో ట్రాలీ అసోసియేషన్,సి ఐ టి యు, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో గురువారం రోజున బస్టాండ్ నుండి మార్కెట్ మీదుగా ఐబీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు, అనంతరం వేంపల్లిలోని జిల్లా రాష్ట్ర రోడ్డు రవాణా కార్యాలయం ముందు ధర్నా  చేశారు. ఈ సందర్భంగా సి ఐ టి యు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 2019 సంవత్సరంలో మోటార్ వాహనాల చట్టం - 2019 ను  సేఫ్టీ పేరుతో భారీ చలాన్లు పెంచుతూ ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగిందని, ఈ చట్టం ద్వారా మోటార్ వాహన యజమానులు, కార్మికులు నడ్డి విరిచి వేలాది, లక్షలాది రూపాయల పెనాల్టీలు వేసి,కార్మికుల బతుకులపైన పెను భారం మోపుతోందని. అదేవిధంగా వాహన కొనుగోలు పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పన్నుల భారం మోపిందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏప్రిల్ 1 నుండి జీవో నెంబర్ 714 ప్రకారం ఫిట్నెస్ రెన్యువల్  గడువు అయిన తర్వాత రోజుకు  50 రూపాయల చొప్పున పెనాల్టీలు వేస్తున్నారు. ఫీట్ నెస్ రెన్యూవల్ పై రోజుకు 50 రూపాయల ఫెనాల్టీ రద్దు చేసి, రోడ్ సేఫ్టీ బిల్లును 2019 రద్దు చేయాలని. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలు తగ్గించాలని పలు డిమాండ్ తో గురువారం రోజున నిరసనగా రాష్ట్ర రవాణా బంద్ చేపట్టారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియూ  జిల్లా కార్యదర్శి తిరుపతి,  అసోసియేషన్  జిల్లా బాద్యులు రమేష్, పున్నం, తిరుపతి, రాజమల్లు, లాస్మయ్య, నరేష్, మల్లేష్,తదితరులు పాల్గొన్నారు.