అనాధ వృద్ధాశ్రమం పేరుతో అన్యమత ప్రచారం

Published: Monday November 07, 2022

రాయికల్, నవంబర్ 06 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ పట్టణ కేంద్రం 9వ వార్డులో విజయ హాస్పిటల్ ప్రక్కన అనాధ వృద్ధాశ్రమం పేరుతో అన్యమత ప్రచారం జరుగుతుందని అక్కడివార్డు ప్రజలు తెలిపారు.అన్యమత ప్రచారం పై  స్థానిక ప్రజలుచాలాసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని, అన్యమత (ప్రచార) ప్రబోధ సమయంలో మైకులు పెట్టి విపరీత శబ్దంతో ప్రబోధిస్తున్నారు. ఆ శబ్ద తరంగాలకు విపరీతమైన ఇబ్బంది కలుగుతుందని, అనాధ వృద్ధాశ్రమాన్ని వేరే చోటికి తరలించుకోవాలని చెప్పినప్పటికీ ఆ నిర్వాహకులు పిడచెవిన పడుతున్నారు. అనాధఆశ్రమం ముసుగులో అన్యమత ప్రచారం చేస్తూ మత కల్లోలాలకు దారితీస్తున్నారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా చేస్తున్నారని దీనిపై వెంటనే అధికారులు స్పందించి వేరే చోటికి తరలించవలసిందిగా వార్డు ప్రజలు,పట్టణ ప్రజలు కోరుతున్నారు.