ప్రభుత్వం రైతులకు మూల్యం చెల్లించకపోతే ఉద్యమం ఉదృతం చేస్తాం

Published: Thursday September 08, 2022

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలంలో  బండరావిరాల , చిన్నరావిరాల గ్రామ రైతుల పక్షాన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు  మంగళవారం  మొరపెట్టుకున్న  ఈ సందర్భంగా  ఈరోజు రైతులు మాట్లాడుతూ   సర్వే నెం . 268 భూమిని కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని బండరావిరాల , చిన్నరావిరాల గ్రామములో సర్వే నెం . 268 లో 1972 , 1979 , 1994 , 1999 సంవత్సరాలలో 4 విడతలుగా 209 మంది రైతులకు పట్టాలు జారీచేసారని, ఇందులో దళితులకు , బడుగు , బలహీన వర్గాల కుటుంబాలకు   ప్రతి కుటుంబానికి నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు గత 18 సంవత్సరాలుగా నష్టపరిహారం ఇవ్వలేదని ఆరోపించారు . 209 మంది కుటుంబాల నోట్లో మట్టుకొట్టి అప్పటి ప్రభుత్వం 2004 వ సంవత్సరంలో మైనింగు జోను  బిఎన్ఆర్ క్రేషర్ యజమాన్యం  కింద  భూములను గతంలో మంత్రులు , అధికారుల చుట్టూ తిరిగినా , నేటి వరకు ఎటువంటి నష్టపరిహారం రాకపోగా మైనింగు జోనులో ఉన్న క్రషర్సు యజమానులు మాత్రం రాయిని తీసి కోట్లు గడుస్తున్నారు . రైతులు మాత్రం రోడ్డున పడ్డారని మండిపడ్డారు.  16-08-2022 నుండి నష్టపరిహారం వచ్చేంత వరకు చేస్తున్న నిరహర దీక్ష చేస్తున్న గ్రామస్తులు మైనింగు జోను క్రింద భూములు తీసుకున్నప్పటి నుండి మా రెవెన్యూలో ఉన్న కంకర మిషన్ యాజమానులు ఒక రోజుకు ఒక కోటి రూపాయల బిజినెస్ చేస్తున్నారు . కంకరమిషన్ యాజమానులు, ప్రభుత్వం తలుచుకుంటే ఇంచుమించుగా రెండు లేదా మూడు నెలల ఆదాయం తీస్తే భూములు కోల్పోయిన భూములలో కొన్ని వేల కోట్లు సంపాదీస్తూ , రైతుల నోట్లో మట్టి కోడుతున్నారు.  రైతులకు పెద్ద ఎత్తున నష్టపరిహారం వస్తుంది. క్షణమే రైతులకు నష్టపరిహారం అందించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా బండ రావిరాల, చినరావిరాల గ్రామ రైతులు మాట్లాడుతూ మాకు రావలసిన నష్టపరిహారం కోసం  ఆందోళన , పోరాటాలు నిర్వహిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు,  వై.యస్ .రాజశేఖర్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు , మాజీ మంత్రివర్యులు టి . దేవేందర్ గౌడ్, కల్వకుంట్ల తారక రామారావు , స్థానిక శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి  మాజీ పార్లమెంట్ సభ్యులు, బూర నర్సయ్య గౌడ్ ,స్థానిక పార్లమెంట్ సభ్యులు   కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారిని నష్టపరిహారం గురించి . పలుమార్లు మా ఆవేదనను విన్నవించుకోవడం జరిగింది . హైకోర్టును ఆశ్రయించగా మార్కెట్ వాల్యు ప్రకారం నష్టపరిహారం ఇవ్వలని డైరెక్షన్ ఇచ్చినప్పటికి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు . 2015 సం॥లో మాజీమంత్రివర్యులు పట్నం మహేందర్ రెడ్డి మా గ్రామానికి వచ్చి మైనింగ్లో భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు . 2017 సం॥లో ఐ.టి. శాఖామాత్యులు  కె.టి.ఆర్  బాటసింగారం గ్రామాలకు లిజిస్టిక్ పార్క్ శంఖుస్తాపనకు విచ్చేసిన సందర్భంగా సభలో మెనింగ్లో భూమిని కోల్పోయిన బండరావిరాల , చిన్నరావిరాల గ్రామ రైలకు ఇప్పుడున్న మార్కెట్ ధర ప్రకారంగా నష్టపరిహారం ఇస్తామని బహిరంగంగా ప్రకటించారు . స్థానిక శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి  బండరావిరాల గ్రామమును దత్తత తీసుకుప్పన్నటికి ఇప్పటి వరకు ఎటువంటి నష్టపరిహారం ఇప్పించలేదు . కావున గతంలో 15-09-2021 వ తేది నుండి 30-09-2022 వ తేది వరకు సుమారుగా 16 రోజులు నిరాహార దీక్ష చేసినాము . స్థానిక ఎమ్మేల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి  మరియు కంకరమిషన్లు యజమానుల మాట ప్రకారముగా రైతులకు 3 నెలల్లో నష్టపరిహారము ఇప్పిస్తానని హామీ ఇచ్చారు . హామీ ఇవ్వడం వలన నిరాహరదీక్ష విరమించాము . కాని ఇప్పటికి ఒక సంవత్సరము గడిచిన గాని ప్రభుత్వం నుండి ఎటువంటి నష్టపరిహారం అందలేదు . కావున తిరిగి 16-08-2022 వ తేది నుండి నిరాహారదీక్ష చేస్నున్నాము . ఈ నిరహారదీక్ష కు అన్ని రాజకీయ పార్టీలు దళిత , బి.సి. సంఘాలు స్వచ్చంద సంస్థలు , విద్యావేత్తలు , మేధావులు , విద్యార్థులు , యువజన సంఘాలు మాకు మద్దతు ఇచ్చి మా పోరాటానికి ప్రత్యేకంగా కంకరమిషన్ యజమాన్యం వారు కూడా సహకరించగలరని కోరుతూ భూనిర్వాసితుల పోరాట సమితి బండరావిరాల , చిన్నరావిరాల గ్రామాల రైతులు. సర్పంచ్ కవడి  శ్రీనివాస్ రెడ్డి, బంగారి నరిసింగ్ రావు. నేతి కృష్ణ,ఎం మల్లేష్, బంగారి మైసయ్య, పాయిరాల ఐలయ్య, అభవతిని బస్వామ్మ ,అబవతిని మనెమ్మ, పెండం సతమ్మ, బంగారి ఎల్లమ్మ, గ్రామస్తులు పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.