కరోనా టీకాను ప్రతి ఒక్కరు వేసుకోవాలి

Published: Friday April 16, 2021
ట్రాఫిక్ సీఐ కాశీ విశ్వనాథ్
మేడిపల్లి, ఏప్రిల్ 15 (ప్రజాపాలన ప్రతినిధి) : కరోనా వైరస్ ను అంతం చేయడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కరోనా టీకాను 45 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరు వేయించుకోవాలని ఉప్పల్ ట్రాఫిక్ సీఐ కాశీవిశ్వనాథ్ తెలిపారు. ఉప్పల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీఐ కాశీవిశ్వనాథ్ కరోనా టీకా రెండవ డోస్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరూ మాస్కులు, శానిటైజర్ లు సామాజిక దూరాన్ని పాటిస్తూ అవసరమైతేనే బయటికి రావాలని ప్రజలకు సూచించారు.