-పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వండి. -పదిహేనవ రోజుకు చేరుకున్న బూపోరాటం. -ఆడుకోవాలని

Published: Wednesday March 01, 2023

చేవెళ్ల ఫిబ్రవరి 28, (ప్రజాపాలన):-

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల  కేంద్రంలో పేదవాళ్లు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య  సిపిఐ  నాయకులు ప్రజలతో కలిసి స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య ను  ఎమ్మెల్యే క్వాట్రాస్ లో   కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలు ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని ఇళ్ల స్థలాలు కావాలని పోరాడుతున్న ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం తగదని ఆయన అన్నారు.
మండుటెండలో గుడిసెలు వేసుకొని మంచి నీళ్లు లేకపోయినా తిండి తిప్పలు మానేసి గుడిసెల కోసం కట్టుకున్న భర్తను పిల్లలను వదిలేసి పోరాడుతున్న మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి కనికరం లేకపోవడం బాధాకరమని ఆయన విమర్శించారు.
గుడిసెల కు పట్టాలిచ్చే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని ఎలాంటి ఆటంకాలు సృష్టించిన పోరాటపాటి మధు గుడిసెల పోరాటం కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.
పేదలకు పట్టాలు వచ్చేవరకు పోరాడి జైలు కన్నా వెళ్తాము గాని పోరాటాన్ని ఆపేది లేదని ఆయన మరోసారి ఉద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో  సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే రామస్వామి ఎం ప్రబులింగం బి కే యం యు జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధుల జంగయ్య అధ్యక్షుడు అంజయ్య ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ సిపిఐ మండల కార్యదర్శి సత్తిరెడ్డి ఏఐకేఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సుధాకర్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ షౌరీలు  మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మంజుల మాధవి విజయమ్మ మండల బి కే ఎం యు కార్యదర్శిమల్లేష్ ఏఐటియుసి మండల అధ్యక్షుడుశివ ప్రధాన కార్యదర్శి శివయ్య తదితరులు పాల్గొన్నారు.