తడిపొడి చెత్తను వేరువేరుగా సేకరించాలి : ఎంపిడిఓ వెంకట్రామ్ గౌడ్

Published: Friday December 17, 2021
వికారాబాద్ బ్యూరో 16 డిసెంబర్ ప్రజాపాలన : తడిపొడి చెత్తను వేరువేరుగా సేకలించాలని ఎంపిడిఓ వెంకట్రామ్ గౌడ్ సూచించారు. గురువారం మర్పల్లి మండల పరిధిలోని కల్ ఖోడా, పెద్దాపూర్, సిరిపురం, రావులపల్లి గ్రామాలలో ఎస్బిఎం జిల్లా కో ఆర్డినేటర్ లక్ష్మితో కలిసి తడిపొడి చెత్త సేకరణ గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ.. తడి చెత్త పొడి చేత తీసుకునే ముందు వేరు చేసి తీసుకోవాలని పేర్కొన్నారు. తడి చెత్తతో ఎరువు తయారు చేసుకోవాలని సూచించారు. పొడి చెత్తలోని వ్యర్థాలు అమ్మి నిధులు సమ కూర్చుకోవాలని ఎంపీడీఓ ఎస్బిఎం కో ఆర్డినేటర్ సర్పంచ్ లకు టెక్నికల్ అసిస్టెంట్ లకు  కార్యదర్శులు కు తెలిపారు. అనంతరం నర్సరీలు బ్యాగు ఫిల్లింగ్ మనకు ఇచ్చిన టార్గెట్ ఇంకను పూర్తి చేయనందున అసహనం వ్యక్తం చేశారు. 2 రోజులలో 15000 బ్యాగు ఫిల్లింగ్ పూర్తి చేయాలని విత్తనాలు నాటించాలని అదేశించారు. మిగిలిపోయిన క్రిమిటోరియం పనులు నెల ఆఖరి వరకు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు స్పష్టం చేశారు. పల్లె ప్రకృతి అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలకు ట్యాంకర్ తో నీళ్ళు పెట్టాలని మొక్కలు ఎండి పోయిన చోట రీప్లేస్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపిఓ అంజి రెడ్డి, సర్పంచ్ శివకుమార్, ఉమ రాణి గోపాల్ రెడ్డి, టిఏలు బలవంత రెడ్డి, పురుషోత్తమ కార్యదర్శి రవి, స్వప్న, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.