నేడు "ఊర పోచమ్మ" విగ్రహ ప్రతిష్టాపన

Published: Wednesday March 23, 2022
బెల్లంపల్లి మార్చి 22 ప్రజాపాలన ప్రతినిధి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని గాంధీనగర్ లో ఏర్పాటు చేయనున్న నూతన "ఊర పోచమ్మ" విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం బుధవారం నాడు జరగనుందని నిర్వాహకులు తెలిపారు. దాతల సహాయంతో దాదాపు 25 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న నూతన ఆలయంలో పోచమ్మ తల్లి, విగ్రహ ప్రతిష్టాపన బుధవారం జరుగనుందని, ఈ సందర్భంగా గత మూడు రోజులుగా ఆలయ ప్రాంగణంలో వేద పండితుల లైన పురోహితులతో యజ్ఞాలు, పూజలు, కొన సాగుతున్నాయని, కావున మున్సిపల్ పరిధిలోని కన్నాల బస్తీ, గంగారామ్ నగర్, గాంధీనగర్, కన్నాలవిలేజ్, లక్ష్మీపూర్, గ్రామాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధిక సంఖ్యలో పాల్గొని విగ్రహ ప్రతిష్టాపన, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, జిల్లా పరిషత్ వైస్  చైర్మన్ తోంగల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ కళ్యాణి భీమా గౌడ్, బెల్లంపల్లి ఏసిపి ఎడ్ల మహేష్, తదితరులు హాజరవుతున్నారని వారు తెలిపారు.