చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన శోభయాత్ర

Published: Monday February 21, 2022
శేరిలింగంపల్లి- ప్రజాపాలన /న్యూస్ : సగర్వంగా చెప్పుకునే ధీరుడు. చత్రపతి శివాజీ 392వ జయంతి సందర్భంగా జెండా ఊపి ప్రారంభించిన బీజేపీ సీనియర్ నాయకులు కుమార్ యాదవ్ మియాపూర్ నుండి లింగంపల్లి తుల్జా భవాని టెంపుల్ వరకు ఘనంగా శోభ యాత్ర నిర్వహించడం నిర్వహించారు, ఆయన మాట్లాడుతూ.. 17 ఏళ్ళ వయసులోనే శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బిజాపూర్ సామ్రాజ్యానికి చెందిని తోర్నా కోటను సొంతం చేసుకున్న వీరుడు.సుల్తానులే కాదు, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును సైతం వణికించిన చత్రపతి శివాజీ యుద్ధతంత్రాలలో మాత్రమే కాకుండా.. పరిపాలనా విధానంలో కూడా అగ్రగణ్యుడుగా పేరు ప్రతిష్టలు పొందాడని తెలియజేస్తూ. 8 నెలల పాటు పంటలను పండించే రైతులు నాలుగు నెలలలో యుద్ద నైపుణ్యాలు నేర్చుకున్నారు అంటే శివాజీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.తన రాజ్యంలో మంత్రిమండలి, విదేశాంగ విధానంతోపాటు గూడఛారి వ్యవస్థను కూడా ఏర్పాటు చేసిన మేధావి.. మహిళలంటే చాలా గౌరవం. ఇతర రాజ్యాలపై దండెత్తినప్పుడు స్త్రీలపై ఎలాంటి దాడులకు ఒప్పుకునేవారు కాదు. ఎవరైనా దాడి చేస్తే వారిని శిక్షించే వారు. ఆయన లోని వీరత్వం, పరిపాలన విధానం, మహిళల పట్ల ఆయనకున్న అపారమైన గౌరవం . పతిఒక్కరికి ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జ్ఞానేంద్ర ప్రసాద్, చందానగర్ కంటెస్టెంట్ కార్పొరేటర్లు కసిరెడ్డి సింధు రెడ్డి, ఎల్లేష్. విశ్వ హిందూ పరిషత్ కూకట్ పల్లి జిల్లా వారు, బజరంగ్ దళ్, బీజేపీ పార్టీ శ్రేణులు, బీజేవైఎం శ్రేణులు, మహిళా మోర్చా నాయకురాలులు, మొదలగు వారు పాల్గొన్నారు