బహుజన రాజ్యం తోనే బీసీ లకు న్యాయం

Published: Saturday June 04, 2022
బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ నిషాని రామచంద్రం
కరీంనగర్ జూన్ 3 ప్రజాపాలన ప్రతినిధి :
బహుజన రాజ్యం తోనే బీసీ లకు సామాజికంగా, రాజకీయంగా,న్యాయం జరుగుతుందని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ నిషాని రామచంద్రం పేర్కొన్నారు.బిఎస్పి పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర కు సంగీభావంగా గురువారం  మానకొండూర్ మండలం  వేగురుపల్లి గ్రామం లో అసెంబ్లీ అధ్యక్షులు బోనగిరి ప్రభాకర్ అధ్యక్షతన  నిర్వహించిన బీసీల రాజకీయ చైతన్య సబకు ముఖ్య అతిథి గా నిషాని హాజరైయ్యారు.తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరవీరుల స్తూపం చిత్ర పటానికి పూల మాల వేసి నివాలులు అర్పించారు.అనంతరం  గ్రామానికి చెందిన రాపాక అశోక్ @అఖిల్ బీస్పీ పార్టీలోకి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.  ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో బహుజన సమాజ్ పార్టీ కిలక పాత్ర పోషించిదని తెలిపారు.పార్లమెంట్ లో తెరాసకు ఎంపీ ల మద్దతు లేదన్నారు. బహుజన సమాజ్ పార్టీ లోక్ సభ లో 21 మంది, రాజ్యసభలో 15 మంది MP ల  మద్దతు ఇచ్చిందని పేర్కొన్నారు .  ఉద్యమ సమయం లో నీళ్లు నిధులు,  నియామకాలు అన్న కెసిఆర్ పార్టీ అధికారం లోకి వచ్చాక చేపలు, గొర్రెలు, బర్రెలు అని ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.బంగారు తెలంగాణలో  దొరల గడిల పాలన సాగిస్తూ బీసి లకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు గడుస్తున్నా దేశ జనాభాలో 5% శాతం జనాభా గల అగ్రకులస్తులు దేశాన్నీ ఎన్నో ఏళ్లుగా పాలిస్తూ 50% శాతం ఉన్న బీసీలకు విద్య, వైద్యం, అధికారం,అందకుండా  మోసం చేస్తూ వస్తున్నారని,  బీసీలు ఇప్పటికీ దయ నీయమైన స్థితిలోనె ఉన్నారని, తెలంగాణలో దొరలా పాలన సాగుతున్నంత వరకు బహుజనుల బతుకులు ఎప్పటికీ మారవన్నారు.
1950 నుండి 1993 వరకు బీసీ లకు విద్య ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ లు అమలు కానీయకుండా కాంగ్రేస్ బిజెపి పార్టీలు మోసం చేశాయని అన్నారు. బీసీ రిజర్వేషన్ ల కోసమే అంబేద్కర్ తన పార్లమెంట్ సభ్యత్వానికి, తన మంత్రి పదవికి రాజీనామా చేసారని తెలిపారు. ఫూలే సాహు అంబేద్కర్ వల్లనే బీసీ లకు చదువులు,హక్కులు లభించాయని అన్నారు.బంగారు తెలంగాణ లో రైతుల ఆత్మహత్యలు, మహిళల మానభంగాలు, పెరిగిపోయాయని  పేదలకు విద్య, వైద్యం దూరం అయ్యాయని ఆవేదన చెందారు. చట్టసభలో కి 70 మంది బీసీ ఎమ్మెల్యేలను పంపడమే ద్యేయంగా బిఎస్పి పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం తోనే బీసీల బతుకులు బాగుపడతాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో సాగుతున్న బహుజన రాజ్యాధికార యాత్రను ప్రజలందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.రానున్న ఎన్నికలలో  బిసి,ఎస్సీ,ఎస్టీ,ఓసి, మైనారిటీలు) అందరూ ఏకమై ఏనుగు గుర్తుకు ఓటు వేసి బహుజన సమాజ్ పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకురావాలని వారు కోరారు.ఈ  సదస్సు లో  జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్, జిల్లా మహిళా కన్వీనర్ జన్ను స్వరూప, జిల్లా కోశాధికారి ఊళ్లేందుల మహేష్,జిల్లా కార్యదర్శి సంగుపట్ల మల్లేశం, అసెంబ్లీ ఉపాధ్యక్షులు కుమ్మరి సంపత్,మంద రవీందర్, ఎల్కపెల్లి రమాకాంత్, ఫూలే,కనుకుంట్ల స్వామి, దసారపు సదానందం, ఆరెపల్లి వినోద్ తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area