44 మంది ప‌ట్ట‌ణ ల‌బ్దిదారుల‌కు సీఎం స‌హాయ‌నిధి చెక్కులు పంపిణీ

Published: Thursday February 11, 2021
ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పెర్సన్ శ్రావణి, వైస్ ఛైర్పర్సన్ శ్రీనివాస్
 
సీఎం కేసీఆర్ జ‌న్మ‌దినం సందర్బంగా లబ్దిదారుల‌ను సైతం మొక్కలు నాటాల‌ని విన్నపం
 
జగిత్యాల, ఫిబ్రవరి 10 (ప్రజాపాలన): జ‌గిత్యాల ప‌ట్ట‌ణం ప‌లు వార్డుల‌కు చెందిన 44 మంది ల‌బ్దిదారుల‌కు సీఎం స‌హాయ‌నిధి ద్వారా మంజూరైన రూ. 12,73,500  ల‌క్ష‌ల విలువ‌గ‌ల చెక్కుల‌ను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ క్యాంపు కార్యాల‌యంలో అంద‌జేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన అనంత‌రం వైద్యానికి అత్యంత ప్రాధాన్య‌త‌నిస్తూ ప్ర‌భుత్వ వైద్య‌శాల‌ల్లో స‌క‌ల సౌక‌ర్యాలు క‌ల్పించుకుంటున్నామ‌ని, జగిత్యాల ఏరియా వైద్య‌శాల‌లో డ‌యాలసిస్ కేంద్రం సైతం ఉంద‌ని, మాతా శిశు సంర‌క్ష‌ణ కేంద్రం సైతం త్వ‌ర‌లో ప్రారంభించుకోబోతున్నామ‌ని అన్నారు. ఈనెల 17న ముఖ్య‌మంత్రి కేసీఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్బంగా జ‌గిత్యాల నియోజ‌క‌వ‌ర్గంలో ల‌క్ష  మొక్కలు నాట‌నున్నామ‌ని, సీఎం స‌హాయ‌నిధి చెక్కులు పొందిన ల‌బ్దిదారులు సైతం ఇండ్ల వ‌ద్ద మొక్కలు నాటాల‌ని పిలుపునిచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి, పట్టణ పార్టీ అధ్యక్షుడు గట్టు సతీష్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు పంబాల రాము, వొల్లెపు రేణుకమోగిలి, కూతురు రాజేష్, బండారు రజనినరేందర్, మల్లికార్జున్, కుసరి అనిల్, ఒద్ది శ్రీలత రాము, నర్సమ్మ, గంగసాగర్, వానరసి మల్లవ్వతిరుమలయ్య, కోరే గంగమల్లు, తిరుపతమ్మ చదువుల కోటేశ్వరరావు, కో-ఆప్షన్ సభ్యులు రియాజ్ మామా, పట్టణ పార్టీ ఉపాధ్యక్షుడు ఆనంద్ రావు, వొళ్ళెం మల్లేశం,ఏ.ఎం.సి డైరెక్టర్ బండారి విజయ్, నాయకులు అరుముళ్ల పవన్, అహమ్మద్, గౌస్, కూతురు శేఖర్, చిరంజీవి, రాజయ్య తదితరులు ఉన్నారు.