ప్రజా సమస్యలపై సిపిఐ ఆధ్వర్యంలో ఈనెల 21న దర్నా శంకరపట్నం డిసెంబర్ 18 ప్రజాపాలన రిపోర్టర్:

Published: Monday December 19, 2022

శంకర పట్టణం మండలకేంద్రంలో ఆదివారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బోయిని అశోక్ మాట్లాడుతూ..  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తుంది. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైపల్యం చెందుతున్న నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 21న జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల తాహసిల్దార్ కార్యాలయాల ముందు జరుగు దర్నాను జయప్రదం చేయాలని సిపిఐ  పిలుపునిస్తుంది.తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ ప్రభుత్వము రెండోసారి అధికారంలోకి వచ్చిన సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వహించడంతో పాటు అర్హులైన పేద వారందరికీ సంక్షేమ పథకాలు అందడం లేదు, దళిత బంధు స్కీం ప్రవేశపెట్టి ఏడాది గడుస్తున్నా అర్హులైన వారందరికీ ఇప్పటికీ అందలేదు. నియోజకవర్గానికి కొన్ని నామమాత్రంగా పంపిణీ చేసి చేతులు దులుపుకున్నది అన్నారు.అధికార పార్టీకి చెందిన వారికి మాత్రమే దళిత బంధు ఇస్తున్నట్లు అనేక విమర్శలు ఉన్నాయి నియోజకవర్గాల వారిగా కోటాలు కాకుండా ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు స్కీo అందరికీ ఇవ్వాలి. నిర్మాణాలు పూర్తి అయినా డబుల్ బెడ్ రూo ఇండ్లను పేదలకు పంపిణీ చేయలేదు ప్రభుత్వం ఏర్పడిన నుండి ఇప్పటి వరకు ఏ ఒక్కరికి రేషన్ కార్డు కూడా ఇవ్వలేకపోవడం పట్ల అనేకమంది రేషన్ కార్డులు కూడా లేనటువంటి పరిస్థితి నెలకొంది రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చేయలేదున్నారు.అర్హులైన వారందరికీ వృద్ధాప్య,వితంతు,వికలాంగుల పెన్షన్ ఇవ్వలేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలని ఎన్నికల హామీల అమలు కోసం ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపుమేరకు ఈనెల 21న మండల తాహ సిల్దార్ కార్యాలయం ముందు ధర్నాలను జయప్రదం చేయడం కోసం అన్ని వర్గాల ప్రజలు ఈ ధర్నాలో పాల్గొనాలని అశోక్ విజ్ఞప్తి చేసారు .ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి కన్నం సదానందం సిపిఐ నాయకులు తాడవేణి రవి జూల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.