ఆళ్లపాడు అంగన్వాడి కేంద్రంలో పోషణ అభియాన్ మాస అవగాహన కార్యక్రమం: ఏఎన్ఎం తిరుపతమ్మ

Published: Thursday September 15, 2022

బోనకల్, సెప్టెంబర్ 14 ప్రజా పాలన ప్రతినిధి:మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామ అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలకు బాలింతలకు పోషణ అభియాన్ మాస అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఎన్ఎం తిరుపతమ్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోజువారి కార్యక్రమంలో ఉన్న ఆహార నియమాలను తప్పనిసరిగా పాటించి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా కాయకూరలు, ఆకు కూరలు గల పోషక పదార్థాలను తినడం ద్వారా తల్లి కి బిడ్డకు ఆరోగ్యం వంతమైన ఆహారం తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం పొందుతారని సూచించారు. ఎటువంటి ఆరోగ్య సమస్యలుఉన్నా ఆరోగ్య కార్యకర్తకు అంగన్వాడీ సెంటర్లకు సమాచారం ఇవ్వాలని, వారికి ఆరోగ్యపరమైన అంశాలు షార్ట్ ద్వారా టైం టేబుల్ ప్రకారం ఆహర నియామాలను అవగాహన కల్పించారు. అనంతరం తల్లి బిడ్డల మధ్య వ్యత్యాసాలను గుర్తు చేశారు. బరువు బీపీ లను చెకప్ చేసి కావాల్సిన మందులను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం తిరుపతమ్మ, అంగన్వాడీ టీచర్లు పద్మ ,హుస్సేన్ బీ, గౌరమ్మ, ఆశా కార్యకర్తలు కళావతి, రత్నకుమారి పాల్గొన్నారు.