కాపు కులాభివృద్దే లక్ష్యం గా పాటుపడాలి... నూతన వర్కింగ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ల ఎన్ని

Published: Saturday September 03, 2022
హైదరాబాద్(ప్రజాపాలన ప్రతినిధి ):
 
పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు మున్నూరు కాపు కులం అభివృద్ధికి కృషి చేయాలని తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు  కొండ దేవయ్య పటేల్ మున్నూరు కాపు కులస్తులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అపెక్స్ కౌన్సిల్ ప్రకారం నూతనంగా ఎన్నుకోబడిన వర్కింగ్ ప్రెసిడెంట్ లు, వైస్ ప్రెసిడెంట్ ల పేర్లను ప్రకటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 24% జనాభా కలిగిన మున్నూరు కాపు కులస్తు లు రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి  చెందవలసిన అవసరం ఉంది అని అన్నారు. త్వరలోనే గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు మహిళా, రైతు, యువత కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. చల్ల హరిశంకర్ పటేల్, బుక్కా వేణుగోపాల్ పటేల్, గాలి అనిల్ కుమార్ పటేల్ వర్కింగ్ ప్రెసిడెంట్ లతో పాటు తొమ్మిది మంది రాష్ట వైస్ ప్రెసిడెంట్లను , తొమ్మిది మంది సహాయ కార్యదర్శులు, ఆరుగురు ఆర్గనైజింగ్ సెక్రటరీలను  ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు వారికి సోమాజిగూడ ప్రెస్ క్లబ్  నియామక పత్రాలను
అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు పటేల్, ట్రెజరర్ విష్ణు జగత్ పటేల్, జర్నలిస్ట్ ఫోరం హైదరాబాద్ కన్వీనర్ అరుణ్ కుమార్ లతో పాటు నూతన కమిటీ సభ్యులు, వివిధ జిల్లాల నుంచి మున్నూరు కాపుల పెద్దలు తదితరుల పాల్గొన్నారు .
 
 
 
Attachments area