ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయం గురించి గొంతు ఎత్తిన ఉద్యోగులు

Published: Thursday September 09, 2021
హైదరాబాద్, సెప్టెంబర్ 08, ప్రజాపాలన ప్రతినిధి : ప్రింట్, ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియా మిత్రులకు జై భీం మిత్రులారా! గత  కొన్నాళ్లుగా ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల యొక్క ఎదుగుదల ఓర్వలేని కొందరు ప్రభుత్వ పెద్దలు, అధికారులు కుట్ర పన్ని రాజ్యాంగం ఇచ్చిన ప్రమోషన్లలో రిజర్వేషన్లు తీసేస్తున్నారు. ఆ క్రమంలోనే కొన్ని పాత కోర్టు కేసులను ఉటంకిస్తూ అత్యవసర జి.ఓ.లనిచ్చి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల హక్కులు లాక్కుంటున్నారు. సెక్రటేరియట్ ఉద్యోగులకు జరిగిన నష్టం అన్ని డిపార్ట్మెంట్లకు జరక్క ముందే మేల్కొని ఒకవైపు న్యాయ పోరాటం చేస్తూనే ఒక ఉద్యోగశక్తి ప్రదర్శన చేయాలని ఆలోచన చేస్తున్నాం. అందుకు అన్ని డిపార్ట్మెంట్స్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాలంతా ఒక జేఏసీ గా ఏర్పడి పోరాటం చేయడానికి నిర్ణయించాం. రేపు మధ్యాహ్నం 1 గంటలకు జరగబోయే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రభుత్వ రంగ ఎస్సీ మరియు ఎస్టీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఏర్పాటు జరుగుతుంది. కావున దయచేసి మీయొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఈ జేఏసీ ఆవిర్భావ సమావేశాన్ని, మా ఆవేదనను, మాకు జరుగుతున్న అన్యాయాన్ని మీమీ మీడియాలో ప్రచురించాలని, ప్రసారం చేయాలని, ప్రచారం చేయాలని కోరుతున్నాం
గత 04.09.2021 నాడు జరిగిన తెలంగాణ ప్రభుత్వ ఎస్సీ &ఎస్టీ ఉద్యోగుల  జే ఏ సి సమావేశం తీర్మానాలు :
1. 08.09.2021 తేదీ మధ్యాహ్నం 1 గంటలకు JAC- SC&ST Employees’ ఆవిర్భావ  సమావేశం. Venue: Dr. B. R Ambedkar Spoorti Bhavan, MINT COMPOUND.
2. ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో జరుగుతున్న తీవ్ర అన్యాయాన్ని ఖండిస్తూ అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశానికై పిలుపు.
3. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించడానికి రాజ్యాంగ సవరణ కోసం పోరాటం చేయాలని పిలుపు, అందుకోసం  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద  ఒత్తిడి 
4. ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధులకు మెమొరాండం సమర్పణ
5.ఉద్యోగులపై వివిధ శాఖల్లో జరుగుతున్న వివక్షను, అన్యాయాన్ని కేంద్ర ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లడానికి JAC ఢిల్లీ పర్యటన
6. అవకాశమొస్తే ప్రభుత్వంతో చివరగా చర్చలు, అంతిమంగా హైద్రాబాదులో 50 వేల మంది ఉద్యోగులతో శక్తి ప్రదర్శన.